బ్రో సినిమాలో అంబటి రాంబాబు ఇమిటేట్: పవన్ కళ్యాణ్ పై ఘాటుగా అంబటి సెటైర్!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి ఆయన తీసే సినిమాలలో కూడా అనేక రాజకీయపరమైన సీన్లు, పవర్ఫుల్ పంచ్ లు కనిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రిలీజ్ అయిన బ్రో సినిమాలో కూడా వర్తమాన రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించేలా సన్నివేశాలు, డైలాగులు పెట్టి ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్.

బ్రో సినిమాలో పృథ్వి చేసిన శ్యాంబాబు పాత్రతో ఏపీ మంత్రి అంబటి రాంబాబును పరోక్షంగా టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్. మొదట అది మామూలు పాత్ర గానే కనిపించినప్పటికీ మై డియర్ మార్కండేయ పాట చూస్తే అది ఏపీ మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేస్తూ పెట్టిన క్యారెక్టర్ గా కనిపిస్తుంది. దీంతో ఈ పాటలో శ్యాం బాబు పాత్ర పై సెటైర్లు పేలుతున్నాయి.

ambatipawankalyan

ఈ పాటలో పృద్వి గెటప్, ఆయన వేసిన స్టెప్పులు చూస్తే కచ్చితంగా ప్రతి ఒక్కరికి అంబటి రాంబాబు గుర్తొస్తారు. ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలలో భాగంగా అంబటి రాంబాబు వేసిన స్టెప్పులు తాలూకు వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. అటువంటి టీ షర్ట్ ని ధరించి, అంబటి రాంబాబు లానే స్టెప్పులు వేయించి శ్యాం బాబు క్యారెక్టర్ తో అంబటి రాంబాబును ఇమిటేట్ చేయించారు.

ఇక శ్యాంబాబు పాత్రకు పవన్ కళ్యాణ్ క్లాస్ పీకినట్టుగా మధ్యలో ఆ పాటను ఆపించి శ్యాం బాబు పాట ఉన్న టెంపో ఏంటి ? నువ్వు వేస్తున్న స్టెప్ ఏంటి అంటూ పవన్ కళ్యాణ్ క్లాస్ తీసుకోవడం, ఆపై నెక్స్ట్ ఏంటి అంటే శ్యాం బాబు పాత్ర ససెక్స్ అని చెప్పడం, ఇక దీని పైన కూడా పవన్ కళ్యాణ్ అందరూ మీలాగే ఎప్పుడు దాని గురించే ఆలోచిస్తారా అంటూ కౌంటర్ వేయడం ప్రధానంగా కనిపిస్తుంది.

అంతేకాదు లలిత కళలను వదిలేయమని పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చాలా ఘాటుగా చెబుతాడు. ఇక ఈ సన్నివేశం చూసిన వారంతా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసింది ఏపీ మంత్రి అంబటి రాంబాబు నేనని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం పవన్ ఫాన్స్ ఈ సన్నివేశాలను పోస్ట్ చేస్తూ మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేస్తున్నారు.

దీంతో బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్రను తనను ఇమిటేట్ చేయించటంపై అసహనంతో ఉన్న అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు సెటైర్ వేశారు. గెలిచినోడి డాన్స్ సంక్రాంతి ! ఓడినోడి డాన్స్ కాళరాత్రి ! అంటూ టార్గెట్ చేసిన అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ని ఈ పోస్ట్ కు ట్యాగ్ చేశారు. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఓటమిని ఎత్తి చూపి ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+