జగన్ ను కలిసొచ్చాకా అంబటి బిగ్ స్టేట్ మెంట్
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఈ ఉదయం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అక్రమ కేసులో అరెస్టయిన ఆయన మొన్నటివరకు రిమాండ్‌లో ఉన్నారు. రెండురోజుల కిందటే బెయిల్ పై విడుదల అయ్యారు. తాజాగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ ను కలిశారు.
ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..తనపై పెట్టిన అక్రమ కేసుల గురించి జగన్ కు వివరించారు అంబటి రాంబాబు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసుల నిర్లిప్త వైఖరి వంటి అంశాలను జగన్‌కు వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టినట్లు తెలుస్తోంది. ప్రజల పక్షాన, ప్రజల తరుపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు, క్యాడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
జగన్‌ను కలిసిన వారిలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, లోక్ సభ మాజీ సభ్యుడు నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు. బుధవారం నాడు అంబటి రాంబాబుకు భారీ ఊరట లభించింది. న్యాయస్థానంలో ఆయనకు బెయిల్ లభించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంబటి రాంబాబును తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను జిల్లా సెషన్స్ న్యాయస్థానం జడ్జి కొట్టివేశారు.
జగన్ ను కలిసిన అనంతరం అంబటి విలేకరులతో మాట్లాడారు. టీడీపీ మూకలు తన ఇంటిపై దాడికి వచ్చినప్పుడు పోలీసులు రక్షణ కల్పించలేక పారిపోవానల సూచించారని ఆరోపించారు. టీడీపీ నేతలు కర్రలు, రాడ్లు తీసుకుని తన కారుపై దాడికి దిగారని, అడ్డగించిన టీడీపీ శ్రేణులు బండబూతులు తిట్టారని పేర్కొన్నారు. వారు తిడుతున్నారనే ఆవేశంలో తాను స్పందించానని, తాను కూడా మాట తూలానని చెప్పారు. ఆ వ్యాఖ్యల పట్ల నేను పశ్చాత్తాపపడ్డానని, క్షమాపణలు కూడా చెప్పానని అంబటి రాంబాబు వివరించారు.
పవన్ కల్యాణ్ బలం కాపు కులమేనని, కందుకూరులో సొంత కులానికి చెందిన నాయకుడికి టీడీపీ హత్య చేసినా ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. కాపు నాయకులను టీడీపీ చంపుతున్నా కూడా వారికే కాపు కాస్తానంటే ఎవరూ చూస్తూ ఉండరని చెప్పారు. తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా ఐ డోన్ట్ కేర్ అని తేల్చి చెప్పారు అంబటి. కేసులకు భయపడి తగ్గుతాననుకుంటే పొరపాటేనని, తగ్గనే తగ్గబోననీ ఆయన స్పస్టం చేశారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications