పవన్ లేట్ రియాక్షన్ కు అంబటి ఘాటు కౌంటర్..!
ఏపీలో జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడంలో ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోని నేతల్లో అంబటి రాంబాబు ముందుంటారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రి అయిన తర్వాత, ఇప్పుడు విపక్షంలో ఉన్నా పవన్ కళ్యాణ్ ను మాత్రం అంబటి వదలిపెట్టడం లేదు. అవకాశం రాకపోయినా కల్పించుకుని పవన్ పై విమర్శలు గుప్పించడం ద్వారా వార్తల్లో నిలిచేందుకు అంబటి తపన పడుతుంటారు. అలాంటిదే ఇవాళ మరో ఘటన జరిగింది.
హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటన జరిగి దాదాపు నెల రోజులు కావస్తోంది. ఈ ఘటనకు పరోక్షంగా బాధ్యుడైన అల్లు అర్జున్ పై చిక్కడ పల్లి పోలీసులు ఏ11 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపడం, ఆ తర్వాత ఆయన బెయిల్ పై బయటికి రావడం కూడా జరిగిపోయాయి. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ పాత్రపై అసెంబ్లీలో విమర్శలు గుప్పించడం, ఆ తర్వాత అల్లు అర్జున్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వడం కూడా జరిగాయి. ఈ మధ్యలో అల్లు అర్జున్ ను, ఆయన కుటుంబాన్ని మెగా ఫ్యామిలీ అంతా పరామర్శించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్లలేదు.

గతంలో అల్లు అర్జున్ కూ, తన అభిమానులకూ ఉన్న వైరం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సంధ్య థియేటర్ ఘటనలో ఆయన అరెస్టు తర్వాత స్పందించకుండా ఉండిపోయారని భావించారు. తాజాగా మన్యం టూర్ లోనూ విలేఖరులు అల్లు అర్జున్ పై అడిగిన ప్రశ్నకు స్పందించకుండా ఇలాంటి చిన్న విషయాలపై మాట్లాడనంటూ ఏదో చెప్పి వదిలేశారు. కానీ ఇవాళ మాత్రం ఉన్నట్లుండి మీడియా చిట్ చాట్ పేరుతో అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పిస్తూ, రేవంత్ రెడ్డిని పొగుడుతూ పవన్ మాట్లాడారు.
సంఘటన జరిగిన 27 రోజుల
— Ambati Rambabu (@AmbatiRambabu) December 30, 2024
తరువాత నోరు మెదిపి
మీ నిజస్వరూపాన్ని
బయట పెట్టుకున్నందుకు, సంతోషం.@PawanKalyan
దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఎక్స్ లో ఘాటుగా స్పందించారు. సంఘటన జరిగిన 27 రోజుల తరువాత నోరు మెదిపి మీ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నందుకు, సంతోషం అంటూ అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పై ట్వీట్ పెట్టారు. ఇందులో ఎక్కడా పవన్ గురించి ప్రస్తావించకపోయినా ఇది పవన్ ను ఉద్దేశించి చేసిన ట్వీటే అని ఎవరికైనా అర్దమవుతుంది. అయితే దీనిపై పవన్ కానీ, జనసేన శ్రేణులు కానీ ఇంకా స్పందించలేదు.












Click it and Unblock the Notifications