చిత్తూరు నాయుడిగానైనా ఉండండి: అంబటి రాంబాబు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ నాయుడిగా కాకుండా ఎపి నాయుడిగా వ్యవహరించాలని, కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రాజధాని భూముల విషయంలో నమ్మశక్యం కాని వాస్తవాలు బయటపడుతున్నాయని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

రైతులు తీవ్రమైన నిస్పృహతో కాలం గడుపుతున్నారని, రైతుల పరిస్థితి పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం ఉన్నట్లుగా ఉందని ఆయన అన్నారు. భూములు ఇచ్చి ఏమైపోవాలనే దిగులుతో రైతులు కుంగిపోతున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆపి, రైతులను అర్థం చేసుకోవాలని సూచించారు.

Ambati Rambabu suggested Chandrababu

చంద్రబాబును రైతు ద్రోహిగా ప్రజలు భావిస్తున్నారని ఆయన విమర్సించారు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా తమ పార్టీ చూస్తూ ఊరుకోదని, ప్రజా ఉద్యమం చేపడుతుందని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

యువకుడి ఆత్మహత్యాయత్నం

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎదుట బుధవారం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వీఆర్వో పరీక్షలో తనకు అన్యాయం జరిగిందనే బాధతో అతను ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ప్రస్తుతం అతను హైదరాబాదులోని సైఫాబాద్ పోలీసుల అదుపులో ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+