అల్లు అర్జున్ లా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి-రేవంత్ కు లింక్ చేసి అంబటి సెటైర్లు..!
ఓవైపు హైదరాబాద్ సంధ్య థియేటర్ లో పుష్ప2 సినిమా రిలీజ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్లో హీరో అర్జున్ అరెస్టు, బెయిల్, విచారణ, తెలంగాణ ప్రభుత్వ ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మెల్ బోర్న్ లో జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా టెస్టులో ఏపీకి చెందిన నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ పూర్తి చేసి జట్టును ఫాలో ఆన్ నుంచి గట్టెక్కించడమే కాకుండా ఎక్కడా తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ ను అనుకరించాడు. దీంతో నితీష్ స్వదేశంలో హీరోగా మారిపోయాడు.
మెల్ బోర్న్ టెస్టులో అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చూపినట్లుగా గడ్డం సవరిస్తూ తగ్గేదేలే అంటూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ ను అనుకరిస్తూ నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్ తో చేసి చూపించాడు. దీంతో మెల్ బోర్న్ మైదానంలో భారత ప్రేక్షకులు నితీష్ ఇమిటేషన్ కు ముగ్ధులయ్యారు. అదే సమయంలో ఏపీలో వైసీపీ నేత అంబటి రాంబాబు ఈ ఎక్స్ ప్రెషన్ తో కూడిన నితీష్ వీడియోను ఎక్స్ లో పోస్టు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న
— Ambati Rambabu (@AmbatiRambabu) December 28, 2024
"పుష్ప"........ హీరోని వేధిస్తూ
తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి
తీసుకువెళ్తానంటే నమ్మేదెలా అబ్బా ? pic.twitter.com/0b3C7XjpZR
ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న "పుష్ప"........ హీరోని వేధిస్తూ తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి
తీసుకువెళ్తానంటే నమ్మేదెలా అబ్బా ? అంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఇప్పటికే సంధ్య థియేటర్ ఘటన, ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వానికీ, అల్లు అర్జున్, ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ కు గ్యాప్ పెరిగిందన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేసేలా వైసీపీ నేత అంబటి పెట్టిన ట్వీట్ కాకరేపుతోంది.












Click it and Unblock the Notifications