పవన్ విడాకుల వ్యవహారం..! క్యాడర్ కు టీడీపీ, వైసీపీ కీలక ఆదేశాలు?

ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) .. తన మూడో భార్య అన్నా లెజ్నోవాకు విడాకులు ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో ఈ విడాకులు తీసుకుంటున్నామని, తమ వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించి దీనిపై అతిగా స్పందించవద్దంటూ ఉమ్మడిగా ఓ లేఖ కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సోషల్ మీడియా అంతా ఈ అంశంపైనే హోరెత్తుతోంది. పార్టీల అభిమానులు ఎవరికి వారు తమదైన శైలిలో రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీతో పాటు వైఎస్సార్సీపీ కూడా తమ క్యాడర్ కు కీలక ఆదేశాలు ఇచ్చాయి.

ఏపీ ఉద్యోగులకు అలర్ట్..! పీఆర్సీ ఇచ్చే వరకూ వీటన్నింటికీ బ్రేక్..!
ఏపీ ఉద్యోగులకు అలర్ట్..! పీఆర్సీ ఇచ్చే వరకూ వీటన్నింటికీ బ్రేక్..!

ముందుగా టీడీపీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ తమ క్యాడర్ కు ఓ కీలక ఆదేశం ఇచ్చింది. ఇందులో ఎక్కడా పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేకుండా.. తమ కూటమి పార్టీల నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులతో సహా ఎవరైనా వ్యక్తిగత జీవితాలపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, చర్చలు జరపడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఐడీపీకి సంబంధం ఉన్న సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. అలాగే ఎవరైనా వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలు లేదా కించపరిచే వ్యాఖ్యలతో ఐటీడీపీకి ఎలాంటి సంబంధం లేదని కూడా క్లారిటీ ఇచ్చింది.

Amid Pawan Kalyan Divorce TDP ysrcp Warns Cadre Against Personal Attacks Stresses Political Decorum
ముగ్గురి పోరులో 76 చోట్ల గెలిచిన వైసీపీ..! బయటపడుతున్న షాకింగ్ లెక్కలు..!
ముగ్గురి పోరులో 76 చోట్ల గెలిచిన వైసీపీ..! బయటపడుతున్న షాకింగ్ లెక్కలు..!

అటు వైఎస్సార్సీపీ కూడా దాదాపు ఇదే విధంగా స్పందించింది. - పవన్ కళ్యాణ్ తాజా విడాకులకు సంబంధించి ఎక్కడా ఏమీ మాట్లాడవద్దని, అస్సలు స్పందించవద్దని తమ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తూ అంతర్గత వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టింది. తద్వారా వారిని ఇలాంటి సున్నితమైన విషయంపై సంయమనం పాటించాలని చెప్పకనే చెప్పింది. అయినా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై ప్రత్యర్థుల వార్ మాత్రం ఆగడం లేదు. ఇందులో పవన్ కు అనుకూలంగా, వ్యతిరేకంగా విడిపోయి పార్టీల క్యాడర్, అభిమానులు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+