వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ జేడీ లక్ష్మీనారాయణకు టీడీపీ బంపరాఫర్..!?

|
Google Oneindia TeluguNews

CBI Ex JD Laxmi Narayana: ఏపీలో ముందస్తుగానే ఎన్నికల కసరత్తు మొదలైంది. సీఎం జగన్ వై నాట్ 175 అంటూ ముందుకెళ్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు 100 శాతం గెలుపు టీడీపీదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు పవన్ లక్ష్యం కూడా వైసీపీ ఓటమే. బీజేపీ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఇదే సమయంలో పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్ధుల ఎంపిక పైనా అధినేతలు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా టీడీపీలో కీలకమైన నేతలకు వైసీపీ గాలం వేస్తోంది. జగన్ కు వ్యతిరేకమైన వారిని తమ వైపు తిప్పుకొనే ప్రయత్నంలో టీడీపీ ఉంది. ఇప్పుడు ఆ లిస్టులో వైఎస్ వివేకా కుమార్తెతో పాటుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేరారు.

2024 ఎన్నికలకు లక్ష్మీనారాయణ సిద్దం..

2024 ఎన్నికలకు లక్ష్మీనారాయణ సిద్దం..


సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పదవిలో ఉన్నప్పుడు ఒక విధంగా ఫేమస్ అయితే, రిటైరైన తరువాత కూడా వార్తల్లో నిలుస్తున్నారు. జగన్ పైన నాడు సీబీఐ విచారణ సమయంలో లక్ష్మీనారాయణ విచారణాధికారిగా వ్యవహరించారు. విచారణ కు సంబంధించిన వార్తలు టీడీపీకి మద్దతుగా నిలుస్తుందనే ప్రచారంలో ఉన్న మీడియాలో రోజూ ప్రచురితం అయ్యేవి. లక్ష్మీనారాయణ నాడు విచారణాధికారిగా జగన్ కు వ్యతిరేకంగా టీడీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నాంటూ అప్పట్లోనే వైసీపీ నేతలు ఆరోపించే వారు. ఆ తరువాత లక్ష్మీనారాయణ ఏపీ నుంచి బదిలీ అయ్యారు. జగన్ రాజకీయంగా బీజీ అయ్యారు. ఇప్పుడు ఏపీ సీఎం అయ్యారు. ఇక, 2019 ఎన్నికల్లో అనేక తర్జన భర్జనల తరువాత జేడీ లక్ష్మీనారాయణ ఎట్టకేలకు జనసేనలో ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో జగన్ అభ్యర్ధి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత జనసేన నుంచి బయటకు వచ్చేసారు. కానీ, ఇప్పుడు 2024 ఎన్నికల్లో తాను పోటీకి సిద్దమని లక్ష్మీనారాయణ స్పష్టం చేసారు.

విశాఖ నుంచే మరోసారి బరిలోకి..

విశాఖ నుంచే మరోసారి బరిలోకి..


2019 లో ఓడిన చోటే మరోసారి పోటీ చేసి గెలవాలనేది మాజీ జేడీ లక్ష్మీనారాయణ నిర్ణయం. ఇందు కోసం వ్యూహాత్మకంగా 2019 ఎన్నికల తరువాత నుంచి విశాఖ కేంద్రంగానే కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది చెప్పలేనని..విశాఖ నుంచి పోటీ ఉంటుందని మాత్రం జేడీ పలు మార్లు క్లారిటీ ఇచ్చారు. జేడీకి పార్లమెంట్ కు పోటీ చేయాలనేది లక్ష్యంగా కనిపిస్తోంది. తాజాగా జనసేన -టీడీపీ - బీజేపీ పొత్తు వార్తల నడుమ జేడీ ఏ నిర్ణయం ప్రకటించేదనే విషయం అర్దం అవుతోంది. తాను పని చేసి వచ్చిన జనసేనలోకే మాజీ జేడీ రీ ఎంట్రీ ఇస్తారని ప్రచారం సాగినా.. ఆ అవకాశాలు లేవని తెలుస్తోంది. బీజేపీలోకి ఇప్పటికే ఆయనకు ఆఫర్ వచ్చింది. కానీ, బీజేపీలోకి వెళ్లటం పైన ఆయన అంత ఆసక్తి లేరని సమాచారం. బీజేపీలో చేరి ఆ పార్టీలో పోటీ చేసిన తిరిగి జనసేన లేదా టీడీపీతో పొత్తు ద్వారానే వెళ్లాల్సి ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నట్లుగా సమాచారం. ఈ సమయంలోనే అవసరమైనే ఇండిపెండెంట్ గా పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

టీడీపీ నుంచి ఆఫర్ - అంగీకరిస్తే..!?

టీడీపీ నుంచి ఆఫర్ - అంగీకరిస్తే..!?

సీబీఐ మాజీ జేడికి టీడీపీ నుంచి తాజాగా ఆఫర్ వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. లక్ష్మీనారాయణ పార్టీలోకి వస్తే విశాఖ సీటు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు పార్టీ ముఖ్య నేతల్లో చర్చ సాగుతోంది. 2014 ఎన్నికల సమయంలోనే లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ, అప్పటికే జగన్ కేసులు విచారించి ఉండటం..టీడీపీతో లక్ష్మీనారాయణ సంబంధాల పైన విమర్శలు ఉండటంతో ఆ సమయంలో చేరలేదని చెబుతున్నారు. ఇక, ఇప్పుుడు విశాఖ కేంద్రంగా టీడీపీని దెబ్బ కొట్టే వ్యూహాలను వైసీపీ మొదలు పెట్టింది. టీడీపీ ఎమ్మెల్యే గంటా సైతం వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. దీంతో, విశాఖలో ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం లక్ష్మీనారాయణ న్యాయ పోరాటం చేస్తున్నారు. విశాఖ నుంచే లక్ష్మీనారాయణకు అవకాశం ఇవ్వటానికి టీడీపీ సిద్దంగా ఉందని చెబుతున్నారు. దీనికి లక్ష్మీనారాయణ ఆమోదం చెబితే..వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే బరిలో నిలవటం ఖాయం కానుంది.

English summary
News Roaming that TDP eyes on Former CBI JD Lakshminarayana for Vizag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X