చంద్రబాబు ప్రతిపాదనకు షా అంగీకారం..!!

ఏపీ భవిష్యత్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. ప్రధాని మోదీ - చంద్రబాబు సారధ్యంలో ఏపీ మూడింతలు డెవలప్ అయ్యేలా ముందుకు వెళ్తామని ప్రకటించారు. పోలవరం .. అమరావతికి కేంద్రం ఇచ్చిన సాయం గురించి వివరించారు. ఏడు నెలల కాలంలోనే కేంద్రం ఏపీ కోసం వేల కోట్లు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని అమిత్ షా స్పష్టం చేసారు. 2024 లో కేంద్రంతో పాటుగా రెండు రాష్ట్రాల్లో విజయం సాధించిన ఎన్డీఏ.. ఈ ఏడాది ఢిల్లీలో విజయం తో మొదలు పెడుతుందని ధీమా వ్యక్తం చేసారు.

అమిత్ షా హామీ
ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రారంభించారు. తిరుపతి రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను.. వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఎన్డీఆర్ఎఫ్ ఉంటుందని అన్నారు. మనుషుల విపత్తు నుంచి కాపాడటానికి ఎన్డీఏ ముందు ఉంటుంద ని చెప్పారు. చంద్రబాబు, మోదీ జోడీల నాయకత్వం మూడింతల ప్రగతి మనం సాధిస్తామని చెప్పుకొచ్చారు. ఆరు నెలల్లో ఏపీకి మోదీ రూ. 3 లక్షల కోట్లు సాయం అందించారని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.11,440 కోట్లు సాయం కింద కేంద్రం కేటాయించిందని గుర్తు చేసారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రులు ఆత్మగౌరవం ముడి పడి ఉందని చెప్పిన షా... సున్నితమైన అంశంలో కేంద్రం ప్రజలకు భరోసా ఇచ్చిందన్నారు.

Amith Shah says The pair of PM Modi and CM Naidu will speed up the development by three times in AP

ఆదర్శంగా తీసుకోవాలి
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇచ్చిందని చెప్పారు. 27 వేల కోట్ల మేర నిధులు మంజూరు చేసామని వివరించారు. రైల్వే జోన్ పట్టాలెక్కిందని చెప్పుకొచ్చారు. పోల వరం నిర్మాణం పూర్తి చేసి 2028 నాటికి నీరు ఇచ్చి తీరుతామని ప్రకటించారు. రూ. 2 లక్షల కోట్లతో విశాఖ గ్రీన్ ఎనర్జీకి కేటాయించామని వెల్లడించారు. లక్షా 20 వేల కోట్లతో జాతీయ రహదా రులు నిర్మాణం జరుగుతుందని చెప్పారు. అమిత్ షా పని తీరును అందరూ ఆదర్శంగా తీసుకో వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. సారధ్యంలో ఎన్నో విపత్తులను ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు.

పవన్ ప్రశంసలు
సిబ్బందికి అవసరమైన అన్ని వనరులు ప్రభుత్వం పరంగా అందించారని వెల్లడించారు. టెర్రరి స్టు, నక్సలైటు, ఇతర సమస్యలను అమిత్ షా బాగా పరిష్కరించారని ప్రశంసించారు. అమిత్ షా సారధ్యంలో దేశం‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పారు. వెంటి లేటర్ ‌పై ఉన్న ఏపీని కేంద్రం సహకారంతో బెడ్ మీదకు తీసుకు వచ్చిందన్నారు. ఎన్టీఆర్‌ఎఫ్ సేవలు మనకు ఎంతో ముఖ్యమైనవని పవన్ పేర్కొన్నారు. ఎల్జీ ఫార్మా ప్రమాదం, విజయవాడలో వరదల సమయంలో వారు ఎన్నో సేవలు అందించారని గుర్తు చేసారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+