నేటి నుండి అమ్మ ఒడి వారోత్సవాలు .. జాబితాలో పేర్లు లేని వారికి జనవరి 5 వరకు ఆఖరి ఛాన్స్

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన నవరత్నాల అమలుపై దృష్టి సారించారు . రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో చాలా కష్టాల్లో ఉన్నా తాను అందిస్తానని చెప్పిన పథకాలను అందించి తీరుతున్నారు. అలాంటి ఎన్నికలహామీ అయిన అమ్మ ఒడిని నేటి నుండి ప్రారంభిస్తున్నారు. అమ్మ ఒడి వారోత్సవాలు నేటి నుండీ ప్రతి జిల్లాలో నిర్వహించనున్నారు.

చిన్నారులను విద్యావంతులుగా చేసే అమ్మ ఒడి .. తల్లులకు ఆర్ధిక ఆసరా

చిన్నారులను విద్యావంతులుగా చేసే అమ్మ ఒడి .. తల్లులకు ఆర్ధిక ఆసరా

వై ఎస్ జగన్ ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన హామీలో భాగంగా చిన్నారులను విద్యావంతులుగా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో చదువుకు ఎవరూ స్వస్తి చెప్పకూడదని భావించిన సీఎం జగన్ బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో 15 వేలు జమచేసేలా ‘అమ్మ ఒడి' పధకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇక ఆ మాట నిలబెట్టుకోటానికి ఏపీ సీఎం జగన్ జనవరి నుండి పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ పధకానికి ఆమోదముద్ర కూడా లభించింది.

సంతోషంలో తల్లులు ...నేటి నుండి అమ్మ ఒడి వారోత్సవాలు

సంతోషంలో తల్లులు ...నేటి నుండి అమ్మ ఒడి వారోత్సవాలు

అమ్మ ఒడి పథకం అమలు కోసం రూ.6,450 కోట్లు కేటాయింపు చేసింది ఏపీ ప్రభుత్వం . ఇక ఈ పథకం పొందటానికి తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉన్న వారు అర్హులు. వారికి అమ్మఒడి పథకం కింద ప్రతి ఏటా రూ.15,000 అందజేయనున్నారు . ఇక ఈ సంవత్సరం ఈ నెల అంటే జనవరి నుంచి విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలోకి అమ్మఒడి పథకం ఆర్ధిక సహాయం పడనుంది.నేటి నుండి అమ్మ ఒడి వారోత్సవాలు నిర్వహించనున్నారు. దీంతో తమ పిల్లల చదువులకు భరోసా కలుగుతుందని తల్లులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అమ్మ ఒడి లో చేరే ఆఖరి ఛాన్స్ జనవరి 5వరకు

అమ్మ ఒడి లో చేరే ఆఖరి ఛాన్స్ జనవరి 5వరకు

అయితే ఈ పథకానికి సంబంధించి, ఇప్పటికే విడుదలైన జాబితాలో పేరులేని తల్లితండ్రులు, వారికి సంబందించిన ధ్రువపత్రాల నకళ్లను ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి అందజేయాలని అధికారులు చెప్తున్నారు . నేటి నుంచి అమ్మఒడి వారోత్సవాలను అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్ .

వారోత్సవాలలో అమ్మ ఒడిపై అవగాహనా కార్యక్రమాలు

వారోత్సవాలలో అమ్మ ఒడిపై అవగాహనా కార్యక్రమాలు


అయితే అమ్మ ఒడి పథకం పై, తల్లితండ్రుల కమిటీ సభ్యులకు, విద్యార్థుల తల్లితండ్రులకు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈమేరకు ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల పేర్లను సంబంధిత జాబితాలో ఏర్పాటు చేయనున్నారు. ఎవరైనా పేరు లేని వాళ్ళు ఉంటె ఈనెల 5వ తేదీ సాయంత్రం లోగా సంబంధిత పత్రాలతో మళ్ళీ అధికారులకు అందజేసే సదవకాశాన్ని కల్పించారు అధికారులు .

 జనవరి 9న సీఎం చిత్తూరులో ‘అమ్మ ఒడి’ ప్రారంభించనున్న జగన్

జనవరి 9న సీఎం చిత్తూరులో ‘అమ్మ ఒడి’ ప్రారంభించనున్న జగన్

ఇప్పుటికే 42 లక్షల 80 వేల 753 మందిని పథకానికి అమ్మ ఒడి అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. వీరి కోసం రూ. 6,421 కోట్లను కేటాయించింది. జనవరి 9న సీఎం జగన్ చిత్తూరులో ‘అమ్మ ఒడి' పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ స్కీమ్ ద్వారా 1 వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే విద్యార్థులు తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ. 15 వేలు జమ చేయనుంది.మొత్తానికి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+