Crime News: ప్రేమ ఒకరితో.. న్యూడ్ కాల్స్ మరొకరితో.. సూసైడ్ చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి..
ప్రేమంటే రెండు అక్షరాలే కాదు రెండు మనస్సుల కలయిక. కానీ ఈ రోజుల్లో ప్రేమ అనేది సహజం అయిపోయింది. ప్రేమ అంటే రెండు మనస్సుల కలయిక కాదు.. రెండు శీరీరాల కలయికగా అర్థం మారిపోయింది. కానీ కొందరు ఇప్పటికీ స్వచ్ఛంగా ప్రేమించేవారు ఉన్నారు. అలా ప్రేమించే వారికి చావే దిక్కవుతుంది. తాజాగా ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రేయసి మోసం చేసిందని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సూసైడ్ నోటు
ఆమె తప్పుడు ప్రేమతో తాను పిచ్చివాడయ్యానని.. జీవితంపై విరక్తి చెందానని చెప్పి సూసైడ్ నోటు కూడా రాశాడు. ఈ ఘటన విజయవాడలో జరిగింది. తాను ఓ యువతిని ప్రేమించి మోసపోయానని లేఖలో పేర్కొన్నాడు. ఆ యువతి చేతిలో తనలా మోసపోయిన వారికి న్యాయం చేయవాలని సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు.

నగ్నంగా వీడియో కాల్స్
ఆమె టైమ్‌పాస్ ప్రేమ వల్ల పిచ్చోడినయ్యా.. నాపై ప్రేమ నటిస్తూ ఓ లెక్చరర్‌తో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతోంది. అబ్బాయిలు మోసం చేస్తే హైలైట్ చేస్తారు. అదే అమ్మాయిలు చేస్తున్న మోసాన్ని సమాజం ఎందుకు ప్రశ్నించదు అంటూ లేఖలో ప్రశ్నించాడు. ఆమె తనతో ప్రేమలో ఉన్నట్లు నటిస్తోందని.. పెళ్లయిన లెక్చరర్ తో రిలేషన్ షిప్ కొనసాగిస్తోందని లేఖలో పేర్కొన్నాడు. రాత్రి వేళల్లో ఆమె వేరొకరితో వీడియో కాల్స్ చేసిందని ఆరోపించాడు.

కృష్ణలంక
కృష్ణలంకకు చెందిన అబ్దుల్ సలాం(19) కానూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న విద్యార్థిని తనను ప్రేమించినట్లు నటిస్తూ మోసం చేయడంతో జీవితంపై విరక్తి చెందాడు. రాత్రి వన్‌టౌన్ నైజాం గేటు సెంటర్ సమీపంలో రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications