అమితాబ్ బచ్చన్ నోట పవన్ కళ్యాణ్ మాట.. అద్భుతం భయ్యా!!
పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశం ఇచ్చిన నాయకుడు అయ్యాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎవరు ఊహించని విపరీతమైన ఒడిదుడుకులను ఎదుర్కొని ఎట్టకేలకు రాజకీయాలలో ప్రభంజనం సృష్టించి తన మార్కు చూపించుకున్నాడు. ఒక్కసారిగా దేశం మొత్తం దృష్టిని పవన్ కళ్యాణ్ ఆకర్షించాడు.
రాజకీయాల్లో రికార్డ్ సృష్టించిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ పేరుతో రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ తొలిసారి ఎన్నికలలో పోటీ చేసి రెండు చోట్ల ఓటమిపాలయ్యారు. తమ పార్టీ నుండి పోటీ చేసిన ఒక స్థానం మినహాయించి అన్ని స్థానాల్లోనూ దారుణ ఓటమిని చవిచూశారు. అయినప్పటికీ మొక్కవోనీ దీక్షతో మళ్ళీ ప్రజాసేవకే పునరంకితమై ఈసారి ఎన్నికలలో 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించారు. పోటీ చేసిన 21స్థానాల్లోనూ ఘనవిజయాన్ని సాధించి రాజకీయాలలో రికార్డును సృష్టించారు.

కౌన్ బనేగా కరోడ్ పతిలో పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్న
ఇక అటువంటి పవన్ కళ్యాణ్ పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన మార్క్ పాలన సాగిస్తున్నారు. తాజాగా కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నను అడగడం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో ఆసక్తిని కలిగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా జూన్ 24వ తేదీన బాధ్యతలు చేపట్టిన నటుడు ఎవరు అంటూ అమితాబ్ బచ్చన్ ప్రశ్న అడిగారు.
ఆడియన్స్ పోల్ లో అంతా పవన్ వైపే
ఈ ప్రశ్నకు నాలుగు ఆప్షన్లను ఇచ్చారు. ఏ. పవన్ కళ్యాణ్, బి. చిరంజీవి, సి. నాగార్జున, డి. నందమూరి బాలకృష్ణ. ఇక ఈ ప్రశ్నకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సమాధానం కోసం ఆడియన్స్ పోల్ కు వెళ్ళగా ఎక్కువమంది పవన్ కళ్యాణ్ అంటూ పోల్ చేశారు. దీంతో వారు పవన్ కళ్యాణ్ అని సమాధానం చెప్పగా ఖచ్చితమైన సమాధానం చెప్పారని అమితాబచ్చన్ పేర్కొన్నారు.
అమితాబ్ బచ్చన్ గారి అభిమాని గా మొదలైన @PawanKalyan గారి ప్రస్థానం
— Pawan Kalyan Crew (@PSPKCrew) September 14, 2024
ఈరోజు అమితాబ్ బచ్చన్ గారు నిర్వహిస్తున్న అతి పెద్ద షో లో @SrBachchan గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రశ్న అడిగే వరకు వచ్చింది ❤️🙏 pic.twitter.com/XJG60wAxzN
పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటుడు అంటూ కితాబిచ్చిన అమితాబ్ బచ్చన్
జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ అద్భుతమైన కళాకారుడు కూడా అంటూ అమితాబ్ బచ్చన్ కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి పవన్ కళ్యాణ్ చిరంజీవి సోదరుడు అంటూ తెలిపారు. మొత్తంగా కౌన్ బనేగా కరోడ్పతి వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన షోలో కూడా పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్న అడగడం పవన్ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది. దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ నేపథ్యంలో జనసేన, పవన్ కళ్యాణ్ అభిమానులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications