గుంటూరు, విజయవాడ, అనకాపల్లికి కేంద్రం శుభవార్త
ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు గుంటూరు జిల్లా గోరంట్లలో హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 47వ క్రైస్తవ మహాసభలు జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలిరానున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 6, 10 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అనకాపల్లి-గుంటూరు(07225) స్పెషల్ ఎక్స్ ప్రెస్ పేరుతో నడిచే ఈ రైలు తుని, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ స్టేషన్లలో ఆగుతుంది.
తిరుపతి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల్లో భాగంగా పలు రైళ్లను దారి మళ్లించారు. ఈ నెల 11, 18 తేదీల్లో ఎస్‌ఎంవీటీ బెంగళూరు-టాటానగర్ (12890), 14, 19, 21 తేదీల్లో ఎస్‌ఎంవీటీ బెంగళూరు-హటియా (12836), 16న మంగుళూరు సెంట్రల్-సంత్రాగచ్చి(22852) రైళ్లను రేణిగుంట, అరక్కోణం, కాట్పాడి మీదగా దారి మళ్లించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందజేయాలనే ఉద్దేశంతో భారతీయ రైల్వే పలు మార్పులకు శ్రీకారం చుడుతోంది. రద్దీగా ఉండే రైలు మార్గాల్లో మూడో రైల్వే మార్గాన్ని నిర్మించడం, తక్కువ ఛార్జీల కోసం అమృత్ భారత్ పేరుతో రైళ్లను ప్రవేశ పెట్టనుండటంతోపాటు అమృత్ భారత్ స్కీం కింద దేశవ్యాప్తంగా 550కిపైగా రైల్వేస్టేషన్లను ఆధునికీకరిస్తున్నారు.
ప్రధాన నగరాల్లో రద్దీని తగ్గించేందుకు వాటిని బైపాస్ చేస్తూ వాటికి దగ్గరలోని స్టేషన్లకు త్వరగా చేరుకునేలా ఎంఎంటీస్ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. జొమాటో, స్విగ్గీ లాంటి సంస్థలద్వారా తమకు నచ్చిన ఆహారాన్ని పొందే సౌకర్యాన్ని కూడా కల్పించబోతోంది. ఇది ఎంతవరకు ఆచరణలో సాధ్యమవుతుందనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications