ఆనం "రూటు" మారుతోందా - వైసీపీ కంచుకోటలో పట్టు తప్పుతోంది..!?
ఆనం రామనారాయణ రెడ్డి. అధికార వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూనే ప్రతిపక్షంటే ఎక్కువగా అసహనానికి లోనవుతున్నారు. ఇది తొలి సారి కాదు. వైనాట్ 175 అంటూ సీఎం జగన్ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరు సమస్యగా మారుతోంది. అయితే, ఆనం ఒక్కరే కాదు నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నేతల తీరు ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో పార్టీలో సమీకరణాలు మారుతున్నాయి. అసలు నెల్లూరు వైసీపీలో ఏం జరుగుతోంది. ఎం జగన్ ఏం చేయబోతున్నారు...

ఏం చేశాం .. ఓట్లు ఎమని అడుగుతాం
నెల్లూరు సీనియర్ నేత ఆనం రామానారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార వైసీపీలో కలకలం రేపుతున్నాయి. చేసిన మంచిని చెబుతూ ప్రతీ ఇంటికి వెళ్లాలని సీఎం జగన్ చెబుతున్న వేళ ఆనం మాటలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. నాలుగేళ్ల కాలంలో ప్రజలకు ఏం చేశాం.. ఏమని ఓట్లడుగుతాం అని ఆనం ప్రశ్నించారు. ఒక్క రోడ్డు వేయలేదు..ఒక్క ప్రాజెక్టు కట్టలేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తమ సక్సెస్ గా ప్రచారం చేసుకుంటున్న సంక్షేమం పైనే ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. పెన్షన్లు గత ప్రభుత్వంలోనూ ఇచ్చారని, కానీ గతం కంటే ఎక్కువ ఇస్తున్నా.. స్కీం మాత్రం పాతదే అని చెప్పుకొచ్చారు. అదే విధంగా తాజాగా సీఎం జగన్ గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొత్తగా వాలంటీర్లను నియమించారు. వారి విషయంలోనూ ఆనం చేసిన వ్యాఖ్యలు ఆయనలోన ఫ్రెష్టేషన్ ను బయట పెడుతున్నాయి.

ఆనం ఒక్కరే కాదు..కీలక నేతలు సైతం
నెల్లూరు జిల్లాలో ఆనం ఒక్కరే కాదు. పలువురు సీనియర్లు తమ అసహనం పలు సందర్భాల్లో బయట పెడుతున్నారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పలు సందర్భాల్లో అధికారుల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.ఆయన చేసిన వ్యాఖ్యలకు చర్చకు కారణమయ్యాయి. అదే విధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జిల్లా సమీక్షా సమావేశంలో ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ తో సహా ఇతర అధికారుల పైన ఓపెన్ కామెంట్స్ చేసారు. అల్టిమేటం జారి చేసారు. కోటంరెడ్డి ప్రజా సమస్యలపైన నిరసనలకు దిగారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉంటే చేస్తున్న వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు అవకాశంగా మారుతున్నాయి. పార్టీ పరంగానూ నేతల మధ్య విభేదాలు బయడ పడుతున్నాయి. పార్టీ నేతల మధ్య సమన్వయం కనిపించటం లేదు. గతంలో సజ్జల వంటి వారు నెల్లూరు వెళ్లి అక్క నేతలతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో అన్ని సీట్లు గెలిచి వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీకి బలమైన జిల్లాగా ఉన్న నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఆనం అసహనం వెనుక - రూటు మారుతోందా..!
వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఆనం వైసీపీలో చేరారు. వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ, గెలిచిన సమయం నుంచి రాజకీయంగా సీనియర్ అయిన ఆనం జూనియర్లతో కలిసి పని చేయటం లో పలు సందర్భాల్లో అసౌకర్యానికి గురైనట్లు స్పష్టంగా కనిపించింది. గతంలోనూ పలు సందర్భాల్లో ఆనం చేసిన వ్యాఖ్యల్లో అసహనం స్పష్టమైంది. ఆ సమయంలోనే ఆనం వైసీపీలో కొనసాగుతారా లేదా అనే చర్చ మొదలైంది. కానీ, ఆనం మాత్రం తాను ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నానని..తాను పోటీ చేసే విషయం చెప్పాల్సింది పార్టీ అధినేత జగన్ అంటూ వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు పార్టీ సమావేశంలోనే ప్రజల మధ్యకు వెళ్లటం.. ఓట్లు అడగే అంశం పైన ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చేలా ఉన్నాయనేది వైసీపీ నేతల అభిప్రాయం. మరి, ఆనం వ్యాఖ్యలపైన వైసీపీ అధినాయకత్వం ఏం చేస్తుంది.. నెల్లూరు జిల్లా పార్టీలో పరిణామాల పైన ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications