వాలంటీర్ వ్యవస్థ రద్దు..? టీడీపీ మంత్రి సంచలన కామెంట్స్
ఏపీ రాజకీయాలు మొత్తం కూడా వాలంటీర్ల చూట్టునే తిరుగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.వాలంటీర్ల అంతా కూడా వైసీపీ సానుభూతిపరులే అని టీడీపీ, జనసేన నేతలు ఆరోపణలు చేశారు. ఈక్రమంలో ఎన్నికల విధుల నుంచి వారిని తొలగించాలని ఈ రెండు పార్టీలు కూడా ఎన్నికల సంఘానానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉండాలని ఆదేశించింది.
ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాలంటీర్ల వ్యవస్థపై పెద్ద యుద్దమే నడించింది. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తారంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వారికి టీడీపీ నేతలు సైతం గట్టిగానే కౌంటరిచ్చారు. తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు గౌరవ వేతనం రూ. 10,000 చేస్తామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారు. అయినప్పటికి కూడా కొందరు వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా రాజీనామా చేశారు. మరోవైపు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో వాలంటీర్లు మాట మార్చేశారు.

వైసీపీ నేతలు కొందరు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు కోరుతున్నారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో వాలంటీర్ వ్యవస్థపై అనేక అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి. గ్రామానికి కేవలం 5 మంది వాలంటీర్లను మాత్రమే తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై విధి, విధానాలు రూపొందించిన తర్వాత వాలంటీర్ వ్యవస్థపై కీలక ప్రకటన చేయడానికి టీడీపీ ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది.
మరోవైపు వాలంటీర్లను తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాలంటీర్ల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.తాజాగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వాలంటీర్ వ్యవస్థపై సంచలన కామెంట్స్ చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..వాలంటర్ వ్యవస్థ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
గతంలో ఇచ్చే విధానానికి భిన్నంగా జులై 1 నుంచి పెన్షన్లు అందించబోతున్నాం. ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తించబడిన సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికి పెన్షన్లు అందిస్తాం.వాలంటీర్ల వ్యవస్థను పెన్షన్ల పంపిణీకి మేం ఉపయోగించుకోవడం లేదు. రాజీనామా చేసిన వాలంటీర్లపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలతో వాలంటీర్లు తమను ఎక్కడ శాశ్వతంగా తొలగిస్తారో అని ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications