ఉరవకొండ ఏఎస్‌ఐపై కొడవలితో దాడి: పరిస్ధితి విషమం
అమరావతి: అనంతపురం జిల్లాలోని ఉరవకొండ ఏఎస్‌ఐ మహేంద్రపై రౌడీషీటర్ రామాంజనేయులు మంగళవారం కొడవలితో దాడి చేశాడు. గతంలో ఓ కేసు విషయంలో రామాంజనేయులుపై రౌడీషీటర్ ఓపెన్ చేయడమే దాడి చేయడానికి గల కారణమని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఏఎస్‌ఐ మహేంద్ర ఉరవకొండలో డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరాడు. ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో రౌడీషీటర్ రామాంజనేయులు ఏఎస్‌ఐపై దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో మహేంద్ర తలకు తీవ్ర గాయమైంది. రక్తస్రావం అవుతండటంతో కుటుంబ సభ్యులు హుటాహటిన మహేంద్రను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
శస్త్రచికత్స చేసిన వైద్యులు 10 కుట్లు వేశారు. మహేంద్ర పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. రౌడీషీటర్ కోసం పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. రామాంజనేయులు గుంతకల్లులో ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు.












Click it and Unblock the Notifications