అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోవిడ్ పేషెంట్లకు యోగా,ధ్యానం-'అనంత' కోవిడ్ కేర్ సెంటర్లలో ప్రత్యేక సెషన్లు-మరోసారి గంధం చంద్రుడి మార్క్

|
Google Oneindia TeluguNews

అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని కోవిడ్ కేర్ సెంటర్లలో యోగా,ధ్యానం,వ్యాయామ సెషన్స్ నిర్వహిస్తున్నారు. కరోనా నుంచి కోలుకుంటున్నవారితో ప్రతీరోజూ ఉదయం యోగాసనాలు,ధ్యానం,తేలికపాటి వ్యాయామం చేయిస్తున్నారు. తద్వారా కోవిడ్ రోగుల మానసిక,శారీరక ఆరోగ్యం మెరుగుతుపడుతుందని... వ్యాధి నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చెబుతున్నారు.

'కోవిడ్ పేషెంట్లను మానసికంగా,శారీరకంగా ఫిట్‌గా ఉంచాల్సిన అవసరం ఉంది. వైరస్ సంక్రమించినవారిలో ఒత్తిడి,ఆందోళన,తెలియని భయం,డిప్రెషన్‌ కారణంగా ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అనంతపురంలోని అన్ని కోవిడ్ కేర్ సెంటర్లలో జిల్లా అధికారులు యోగా సెషన్స్ నిర్వహిస్తున్నారు.' అని గంధం చంద్రుడు తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్‌లో వైరస్ బారినపడి జిల్లాలోని కోవిడ్ కేర్ సెంటర్లలో చేరినవారిలో 1791 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు తెలిపారు. కరోనా సోకినవారిలో ఇక తాము కోలుకోలేమోనన్న భయాన్ని తొలగించాలన్నారు. అందుకే జిల్లాలో కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయినవారిని కోవిడ్ పేషెంట్స్ అని కాకుండా 'పాజిటివ్ పర్సన్స్'గా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. కేవలం ఆస్పత్రిలో చికిత్స అవసరమైనవారిని మాత్రమే పేషెంట్లుగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు.

కోవిడ్ కేర్ సెంటర్లలో పూర్తిగా పాజిటివ్ వాతావరణం ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. యోగా,ధ్యానంతో పాటు షటిల్,వాలీబాల్ వంటి ఆటలు,మ్యూజిక్,పాటలతో అక్కడి వాతావరణాన్ని పాజిటివ్‌గా ఉంచుతున్నట్లు తెలిపారు. యోగాలో చేసే సూర్య నమస్కారాల ద్వారా ఫిజికల్ ఫిట్‌నెస్ మెరుగవుతుందని... ప్రాణయామ ద్వారా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని చెప్పారు. అలాగే ధాన్యం ద్వారా ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుందని,మనసుకు శాంతి చేకూరుతుందని చెప్పారు. తద్వారా కరోనా రోగులు త్వరగా వ్యాధి నుంచి కోలుకునే అవకాశం ఉందన్నారు.

anantapuram : yoga meditation sessions in covid care centres for speedy recovery of patients

అనంతపురం కలెక్టర్‌గా గంధం చంద్రుడు తనదైన మార్క్‌తో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పనితీరుకు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. గతంలో ప్రతిష్ఠాత్మక పీఎం కిసాన్ సమ్మాన్ అవార్డును కేంద్రం అనంతపురం జిల్లాకు కేటాయించిందంటే అది కలెక్టర్ కృషి వల్లే. జాతీయ స్థాయిలో మరే జిల్లాలోనూ లేని విధంగా అనంతపురం జిల్లాలో ఏకంగా 99.60 శాతం రైతుల వెరిఫికేషన్ పూర్తి చేయడంతో ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు లభించింది. అనంతపురం జిల్లాను ఉత్తమ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్‌ గంధం చంద్రుడు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారు.

English summary
Yoga, meditation and exercise sessions are conducting at all covid Care Centers across Anantapur district. Those who are recovering from the corona are doing yogasana, meditation and light exercise every morning. District Collector Gandham Chandrudu said that the mental and physical health of the covid patients will improve by these activicities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X