Anantha babu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో భారీ ట్విస్ట్..!!
వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణ హత్యలో అనంతబాబు భార్య అనంత లక్ష్మీ దుర్గ (రోజా) పాత్రపై సిట్ (SIT) కీలక ఆధారాలను సేకరించింది. ఈ మేరకు ఆమెను రెండో నిందితురాలిగా (A-2) చేరుస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో సిట్ బుధవారం అదనపు అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది.
హత్యలో భార్య క్రియాశీలక పాత్ర!
సుబ్రహ్మణ్యం హత్యకు అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ కేవలం సహకరించడమే కాకుండా, ఆయనను ఈ నేరానికి పురికొల్పారని సిట్ నిర్ధారించింది. హత్య జరిగిన రోజు రాత్రి ఆమె అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ కుమార్తెను ఒక పెద్ద కర్ర కావాలని అడిగి మరీ తీసుకున్నట్లు సాక్ష్యాధారాలు లభించాయి. హత్య జరిగిన సమయంలో ఆమె ఘటనా స్థలంలోనే ఉన్నారని, ఆ తర్వాత మృతదేహాన్ని తరలించిన కారులో కూడా అనంతబాబుతో కలిసి ప్రయాణించారని సీసీటీవీ ఫుటేజీల ద్వారా స్పష్టమైంది.

అబద్ధపు వాంగ్మూలాలు - సాంకేతిక ఆధారాలు
గతంలో పోలీసుల విచారణలో తాను ఆ సమయంలో ఆసుపత్రిలో ఉన్నానని లక్ష్మీదుర్గ చెప్పిన మాటలు పచ్చి అబద్ధమని తేలింది. సిట్ అధికారులు 14 చోట్ల నుంచి సీసీ కెమెరా దృశ్యాలను సేకరించి విశ్లేషించగా, ఆమె ఆసుపత్రిలో లేరని, హత్య జరిగిన చీకటి ప్రదేశంలోనే ఉన్నారని నిరూపితమైంది. సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో, మృతదేహాన్ని మాయం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు సిట్ అభియోగపత్రంలో పేర్కొంది.
పుట్టినరోజే రక్తపాతం
2022 మే 19న అనంతబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ రాత్రే ఈ ఘాతుకం చోటుచేసుకుంది. పాత బకాయి రూ. 20 వేల కోసం సుబ్రహ్మణ్యాన్ని బెదిరించిన అనంతబాబు, రాత్రివేళ తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. గెస్ట్ హౌస్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి, ఆపై ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని సుబ్రహ్మణ్యం ఇంటి వద్దే పడేసి, "నోరు మూసుకుంటే రూ. 2 లక్షలు ఇస్తాం" అంటూ బెదిరించిన వైనాన్ని సిట్ పూసగుచ్చినట్లు వివరించింది.
నాడు నీరుగార్చి.. నేడు నిగ్గుతేల్చి
వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు ఈ కేసును తూతూమంత్రంగా దర్యాప్తు చేశారని, కీలక సాంకేతిక ఆధారాలను ఉద్దేశపూర్వకంగానే వదిలేశారని సిట్ ఆరోపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, బాధితుల విన్నపం మేరకు గతేడాది జూలైలో సిట్‌ను ఏర్పాటు చేసింది. సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ప్రాసిక్యూషన్‌కు సహకరిస్తుండటంతో కేసులో వేగం పెరిగింది. నిందితులకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై కూడా చర్యలకు సిట్ సిఫార్సు చేసింది.
పరారీలో ఏ-2 లక్ష్మీదుర్గ
ప్రధాన నిందితుడు అనంతబాబు ప్రస్తుతం బెయిల్‌పై ఉండగా, తాజాగా రెండో నిందితురాలిగా నమోదైన ఆయన భార్య లక్ష్మీదుర్గ పోలీసులకు చిక్కకుండా పరారయ్యారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వ ఒత్తిళ్లతో మరుగున పడిన సాక్ష్యాలను సిట్ వెలికితీయడంతో, బాధితులకు న్యాయం జరుగుతుందన్న ఆశలు చిగురించాయి. కారు డ్రైవర్ హత్యలో దంపతులిద్దరూ భాగస్వాములేనన్న పక్కా ఆధారాలతో కోర్టు విచారణ ప్రారంభం కానుంది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications