పిఠాపురంలో 'జానీ'లు రెచ్చిపోతున్నారు - యాంకర్ శ్యామల

ఏపీలో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో 16 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడాడు. బాలికను ఆటోలో ఎక్కించుకుని ఊరు శివారుకు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం తర్వాత బాలిక అపరస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను తిరిగి ఆటోలో ఎక్కిస్తుండగా, స్థానికులు దుర్గాడ జాన్‌‌ను పట్టుకుని ,అతన్ని పోలీసులకు అప్పగించారు. బాలిక బంధువు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదులోకి తీసుకున్నారు. అయితే బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి టీడీపీ నాయకుడని తెలుస్తోంది. ఈ అఘాయిత్యానికి పాల్పడింది పిఠాపురానికి చెందిన దుర్గాడ జాన్‌గా గుర్తించారు.

ఆయన భార్య దుర్గాడ విజయలక్ష్మి టీడీపీ మాజీ కౌన్సిలర్. ప్రస్తుతం ఆమె పిఠాపురం టీడీపీ పట్టణ అధ్యక్షురాలుగా కూడా పని చేస్తున్నారు. అత్యాచారం తర్వాత బాలిక అపరస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను తిరిగి ఆటోలో ఎక్కిస్తుండగా, స్థానికులు దుర్గాడ జాన్‌‌ను పట్టుకుని ,అతన్ని పోలీసులకు అప్పగించారు. దుర్గాడ జాన్‌ను కేసు నుంచి తప్పించడానికి టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారంతో బాధిత కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిఠాపురంలో బాలిక అత్యాచారం ఘటనపై వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల స్పందించారు.

anchor shyamala react on Rape of a girl in Pithapuram

కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ కరవైందని శ్యామల తెలిపారు. మహిళా హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుతున్న ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదంటూ ప్రభుత్వ తీరుపై శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఎన్నో దారుణాలు జరిగాయని ఆమె తెలిపారు. పిఠాపురంలో జానీలు రెచ్చిపోతున్నారంటూ కూటమి సర్కార్‌పై ఆమె ఘాటు వ్యాఖ్యలే చేశారు. పిఠాపురంలో బాలిక అత్యాచారం ఘటనపై మాజీ మంత్రి రోజా సైతం స్పందించారు. దీక్షలు చేయాల్సింది ప్రసాదాల కోసం కాదని రాష్ట్రంలో రాలిపోతున్న ఎంతో మంది చిన్న పిల్లల మాన ప్రాణాలను కాపాడటం కోసం దీక్షలు చేయడంటూ పవన్ కల్యాణ్‌కు రోజా హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+