టీడీపీతో బీజేపీ పొత్తుతో ఓటరు పల్స్ మారిందా: ఏపీలో అధికారం ఎవరిది? లేటెస్ట్ సర్వే రిపోర్ట్

TDP BJP alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష తెలుగుదేశం.. మరోసారి భారతీయ జనతా పార్టీని ఆశ్రయించింది. బీజేపీ సారథ్యాన్ని వహిస్తోన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో చేరింది. ఈ విషయాన్ని రెండు పార్టీల అధినేతలు అధికారికంగా వెల్లడించారు.

ఆరు సంవత్సరాల తరువాత తెలుగుదేశం పార్టీ మరోసారి ఎన్డీఏలోకి రీ ఎంట్రీ ఇచ్చినట్టయింది. వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి తెలుగుదేశం- జనసేన- బీజేపీ మహా కూటమి కట్టాయి. ఉమ్మడిగా బహిరంగ సభలను నిర్వహించబోతోన్నాయి. వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనబోతోన్నాయి.

Andhra assembly elections 2024 Jan Mat Polls predicts YSRCP will get majority seats

టీడీపీ- జనసేన కూటమిలో బీజేపీ చేరిక తరువాత రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు సంభవించాయి?, ఈక్వేషన్లు ఎలా మారాయి? ఓటరు నాడి ఎలా ఉంది?, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ/కూటమి అధికారంలోకి వస్తుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది? అనే అంశాలపై జన్‌మత్ సంస్థ తాజాగా ఒపీనియన్ పోల్ నిర్వహించింది. వాటి వివరాలను వెల్లడించింది.

టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి కట్టినప్పటికీ.. ఏపీలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ హవా వీస్తుందని అంచనా వేసింది. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 119 నుంచి 122 స్థానాలను గెలచుకుంటుందని అభిప్రాయపడింది. గతంలో ఇదే జన్‌మత్ సంస్థ వైఎస్ఆర్సీపీకి 114 నుంచి 117 స్థానాలు వస్తాయని తెలిపింది.

టీడీపీ- జనసేన కూటమిలో బీజేపీ చేరిక తరువాత వైఎస్ఆర్సీపీ విజయం సాధించే సీట్ల సంఖ్యను మరింత పెంచింది. 119 నుంచి 122 వరకు తీసుకెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మెజారిటీ లోక్‌సభ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ పాగా వేస్తుందని తెలిపింది జన్ మత్ సంస్థ. 19 నుంచి 20 లోక్‌సభ సీట్లను తన ఖాతాలో వేసుకుంటుందని పేర్కొంది.

తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమికి అసెంబ్లీలో 49 నుంచి 51 స్థానాలు, లోక్‌సభలో అయిదు నుంచి ఆరు సీట్లు దక్కుతాయని తెలిపింది. జాతీయ స్థాయిలో చూసుకుంటే- బీజేపీకి 326 328, కాంగ్రెస్- 43 నుంచి 45, తృణమూల్ కాంగ్రెస్- 21 నుంచి 23, ఆమ్ ఆద్మీ పార్టీ- 7 నుంచి 8 లోక్‌సభ నియోజకవర్గాలను గెలుచుకంటాయని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+