‘సాక్షి’ ఛైర్మన్, ఎడిటోరియల్ డైరెక్టర్ పై అరెస్ట్ వారెంట్
పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరుకానందుకు ‘సాక్షి’ దినపత్రిక చైర్మన్ వైఎస్ భారతిరెడ్డి, ఆ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తిపై కృష్ణా జిల్లా నూజివీడు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
అమరావతి: 'సాక్షి' దినపత్రిక చైర్మన్ వైఎస్ భారతిరెడ్డి, ఆ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తిపై కృష్ణా జిల్లా నూజివీడు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరుకానందుకు ఈ మేరకు కోర్టు వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే... కృష్ణా జిల్లా 'తెలుగు రైతు' అధ్యక్షుడు చలసాని ఆంజనేయులిపై ఇటీవల సాక్షి దినపత్రికలో కథనాలు వెలువడ్డాయి. దీంతో ఆయన.. తనపై అసత్య కథనాలు ప్రచురించారంటూ కోర్టుకెళ్లారు.

తప్పుడు కథనాలతో తన పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయంటూ 'సాక్షి' దినపత్రిక చైర్మన్ వైఎస్ భారతిరెడ్డి, ఆ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తిపై చలసాని ఆంజనేయులు పరువునష్టం దావా వేశారు.
ఈ కేసు విచారణ నిమిత్తం భారతిరెడ్డి, రామచంద్రమూర్తి కోర్టుకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.












Click it and Unblock the Notifications