World Cup Final: ఏపీలో వరల్డ్ కప్ ఫైనల్ సందడి- ఈ 13 నగరాల్లో ఏసీఏ బిగ్ స్క్రీన్లు...
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అహ్మదాబాద్ కు ఫ్యాన్స్ తో పాటు వీఐపీలు, రాజకీయ నేతలు క్యూ కట్టారు. అదే సమయంలో వివిధ రాష్ట్రాల్లోనూ క్రికెట్ అసోసియేషన్లు ఈ మ్యాచ్ ను అభిమానుల కోసం బహిరంగంగా ప్రత్యక్షప్రసారం చేయబోతున్నాయి.
ఏపీలో రేపటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను బిగ్ స్క్రీన్లపై ప్రదర్శించేందుకు ఆంధ్రా క్రికెట్ సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ ను ఏసీఏ విజయవాడ, కడప, వైజాగ్ లో ఇలాగే బిగ్ స్క్రీన్లపై ప్రదర్శించింది. దీని స్ఫూర్తితో ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ను ఏకంగా 13 నగరాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా ప్రదర్శించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాలను ఇందుకు ఎంపిక చేసింది.

ఆదివారం జరిగే భారత్, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ ను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు,విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, తిరుపతిలో ఏసీఏ బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రదర్శించబోతోంది. అలాగే ఆయా నగరాల్లో ఎక్కడెక్కడ ఈ ఫైనల్ మ్యాచ్ బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేశారన్న దానిపై వివరాలను కూడా ఏసీఏ ఇవాళ వెల్లడించింది. ఇలా స్కీన్లు పెట్టే చోట అభిమానుల కోసం ఫుడ్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తోంది.
ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ఏపీలో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల వివరాలు..
1.శ్రీకాకుళం: ఎం. హెచ్. స్కూల్ గ్రౌండ్, 7 రోడ్ జంక్షన్
2.విజయనగరం: ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, భాష్యం స్కూల్ వెనుక
3.విశాఖపట్నం: ఆర్కీ బీచ్ , కాళీ మాత టెంపుల్ ఎదురుగా
4. కాకినాడ: రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్
5. ఏలూరు: ఇండోర్ స్టేడియం గ్రౌండ్, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా
6. విజయవాడ: ఎం.జి. రోడ్, ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియం
7. గుంటూరు: మాజేటి గురవయ్య హై స్కూల్ గ్రౌండ్
8. ఒంగోలు: జెడ్పీ మినీ స్టేడియం
9. నెల్లూరు: వి.ఆర్. హైస్కూల్ గ్రౌండ్
10. కడప: ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్
11. అనంతపురం: పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పి.టి.సి)
12. కర్నూల్: డి.ఎస్. ఏ. స్టేడియం
13. తిరుపతి: కె.వి.ఎస్. స్పోర్ట్స్ పార్క్, తుమ్మలకుంట గ్రౌండ్












Click it and Unblock the Notifications