ఏపీలో ఐపీఎస్ అధికారుల వివాదం వేళ.. కీలక బదిలీలు
Chandrababu Naidu: ఏపీలో ఐపీఎస్ అధికారుల వివాదానికి తెర పడట్లేదు. అదింకా కొనసాగుతూనే వస్తోంది. అటు రాజకీయ విమర్శలకూ కేంద్రబిందువు అయిందీ వ్యవహారం. అధికార తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఆరోపణలు- ప్రత్యారోపణలకు కారణమైంది.
మొత్తం 16 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం. వారికి మెమొలను ఇచ్చింది. పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది.

వాళ్లంతా డీజీపీ, అదనపు డీజీపీ, ఇన్‌స్పెక్టర్ జనరల్, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారులే. వీరిలో పీ సీతారామాంజనేయులు, పీవీ సునీల్ కుమార్, ఎన్ సంజయ్, కాంతి రాణా టాటా, జీ పాలరాజు, కొల్లి రఘురామ్ రెడ్డి, ఆర్ ఎన్ అమ్మిరెడ్డి, సీహెచ్ విజయారావు, విశాల్ గున్ని, అన్బురాజన్, వై రవిశంకర్ రెడడి, వై రిషాంత్ రెడ్డి, కే రఘువీరారెడ్డి, పీ పరమేశ్వర్ రెడ్డి, పీ జోషువా, కృష్ణకాంత్ పటేల్ ఉన్నారు.
వాళ్లందరూ కూడా ప్రజల కోసం కాకుండా వైఎస్ఆర్సీపీ కోసం పని చేశారంటూ ఆరోపణలు చేస్తోన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన ఐపీఎస్ అధికారులు జగన్ హయాంలో తమ స్వార్థం కోసం, కోరిన చోట పోస్టింగుల కోసం తమను ఇబ్బందులు పెట్టారంటూ విమర్శిస్తోన్నారు.
ఈ పరిస్థితుల మధ్య తాజాగా మరి కొందరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అనంతపురం ఎస్పీగా జగదీష్ బదిలీ. విశాఖపట్నం ఏపీ ఎస్పీ కమాండెంట్‌గా మురళీకృష్ణ, విజయవాడ డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా మహేశ్వర రాజు, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా సునీల్ బదిలీ అయ్యారు.
గుంతకల్ రైల్వే పోలీస్ సూపరింటెండెంట్‌గా రాహుల్ మీనా, ఇంటెలిజెన్స్ పోలీస్ సూపరింటెండెంట్‌గా నచికేత్ విశ్వనాథ్, చింతూరు అదనపు పోలీస్ సూపరింటెండెంట్‌గా పంకజ్ కుమార్ మీనా, పార్వతీపురం ఎస్‌డీపీవోగా సురానా అంకిత్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications