AP Assembly Election Results 2024 LIVE : సైకిల్ జోరు...ఫ్యాన్ బేజారు-ఏపీలో వార్ వన్‌సైడే..!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దేశం మొత్తం చూస్తోంది. ఇందుకు కారణం ఈ రాష్ట్రంలో మే 13న జరిగిన ఎన్నికల్లో 81శాతం పోలింగ్ నమోదు కావడమే. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ టీడీపీ కూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఇక ఎగ్జిట్ పోల్స్ ఓటర్ల పల్స్‌ను పట్టుకోవడంలో విఫలమయ్యాయనే చెప్పొచ్చు. ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపారో స్పష్టంగా చెప్పడం కష్టతరంగా మారింది. వాస్తవ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ సారి ఎన్నికల్లో ఓటర్ల నాడి ఎవరికి అంతు చిక్కడం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదని రెండు ప్రధాన పార్టీలు చెప్పుకుంటున్నాయి. అయితే ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైఉంది. ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే కొన్ని సర్వే సంస్థలు వైసీపీకి పట్టం కట్టగా.. ఇంకొన్ని సంస్థలు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి. ఇక జూన 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్‌ను లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

ఏపీ, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మన ఎన్నికలను ప్రపంచ దేశాలు ఎంతో ఉత్సాహంగా చూశాయన్నారు. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో చరిత్ర సృష్టించాం.1962 తర్వాత ఏ ప్రభుత్వం కూడా మూడోసారి అధికారంలోకి రాలేదన్నారు.పూరీ జగన్నాథుడి ఆశీర్వాదంతో ఒడిశాలో విజయం దక్కిందన్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 175 స్థానాల్లో పోటీ చేసిన ఆపార్టీ కేవలం పది స్థానాల్లోనే విజయం సాధించింది. కనీసం ప్రతిపక్షహోదాను కూడా కోల్పోయింది. పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బద్వేల్ (ఎస్సీ) - దాసరి సుధ, పులివెందుల -వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రాలయం - వై.బాలనాగిరెడ్డి, ఆలూరు - బూసినే విరూపాక్షి, యర్రగొండపాలెం (ఎస్సీ) - తాటిపర్తి చంద్రశేఖర్, అరకు (ఎస్టీ) - రేగం మత్స్యలింగం, పాడేరు (ఎస్టీ) - మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రాజంపేట - ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, తంబళ్లపల్లి - పెద్దిరెడ్డి ద్వారాకనాథ్‌రెడ్డి గెలుపొందారు.












Click it and Unblock the Notifications