పక్కాప్లాన్ చేసిన చంద్రబాబు, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో !!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అనేక మంది కేంద్ర మంత్రులను కలిసిన సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వీలైనంత సహాయం చేయాలని కేంద్ర మంత్రులకు మనవి చేశారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని, కేంద్రం నుండి నిధులు తీసుకొస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు చాలా సార్లు చెప్పారు.
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో సమావేశాలు అవుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తదితరులతో భేటీ అయిన సీఎం చంద్రబాబు నాయుడు మరో కేంద్రమంత్రి హెచ్ డీ. కుమారస్వామితో సమావేశం అయ్యారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ. కుమారస్వామి నివాసానికి వెళ్లిన నారా చంద్రబాబు నాయుడు పలు విషయాలపై ఆయనతో చర్చించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర మంత్రి కుమారస్వామితో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారని సమాచారం. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని, ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ను దెబ్బతీస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి హెచ్ డీ. కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లాలని సమాచారం.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సరైన నిర్ణయమే తీసుకుంటామని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని, ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమీత్ షా తదితరులతో చర్చించామని, మీరు ధైర్యంగా ఉండాలని కేంద్ర మంత్రి హెచ్ డీ కుమారస్వామి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హామీ ఇచ్చారని తెలిసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ తదితరులతో భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కొన్ని విషయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తో చంద్రబాబు చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లోని జాతీయ రహదారుల విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు నితిన్ గడ్కారీ తో చర్చలు జరిపారని తెలిసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన కేంద్ర మంత్రులు సీఎం చంద్రబాబు నాయుడు వెంట వెళ్లారు. మొత్తం మీద సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సక్సెస్ అయ్యిందని టీడీపీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications