జగన్ కు వైసీపీ కన్నా ముఖ్యమైంది మరొకటి ఉంది తెలుసా?

అధికార పార్టీగా ఎన్నికల్ని ఎదుర్కొన్న తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇంత శాతం పోలింగ్ నమోదైంది.. పోలింగ్ సరళిని బట్టి తామే అధికారంలోకి రాబోతున్నామని, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ జరిగిందంటూ ఏ ముఖ్యమంత్రి అయినా చెబుతారు. అయితే పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాతరోజు జరిగిన హింసాత్మక సంఘటనలపై కూడా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ స్పందించలేదని, అసాంఘిక శక్తుల చర్యలను నియంత్రించలేకపోయారంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తోంది.

వైఎస్ జగన్ భిన్నమైన వైఖరి
ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ విభిన్నమైన వైఖరినే ప్రదర్శిస్తారు. అధినేత పార్టీ వర్గాల నుంచి సమాచారం సేకరించడం సర్వసాధారణం. కానీ నేరుగా ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి అక్కడ మనం గెలవబోతున్నామని సీఎం చెప్పారు. దీన్ని వైసీపీ శ్రేణులే తప్పుపడుతున్నాయి. తాము అధికారంలోకి రాబోతున్నామని చెప్పడంద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలి.. తర్వాత ప్రజలకు చెప్పాలి. కానీ కోట్ల రూపాయల ఫీజులు వసూలుచేసే ఐప్యాక్ కు చెప్పడం ఏమిటండీ బాబూ అంటూ వైసీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. ఐప్యాక్ కు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు వారితో జగన్ సెల్ఫీలు కూడా దిగారు.

andhra pradesh emergency cm ys jagan to Ipac is more important than party

వీరిని ఎక్కడో చూశామండి..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవి వైరల్ గా మారాయి. పెట్టుబడుల సదస్సులో పెట్టుబడిదారులుగా వచ్చింది వీరేకదా?.. పిఠాపురంలో కాపులు కూడా వీరేకదా?.. జగన్ మామయ్యకు మేనల్లుడు, మేనకోడలు కూడా వీరేకదా?.. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులు వీరేకదా?.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జగన్ తో సెల్ఫీ దిగినవారి ఫొటోలు చూసి వీరిని ఎక్కడో చూశామండి అంటున్నారు. సోషల్ మీడియాలో ఐప్యాక్ సభ్యులపై, జగన్ దిగిన ఫొటోలపై మీమ్స్ ప్రారంభమయ్యాయి. మొత్తానికి ఐప్యాక్ టీంతో జగన్ మాట్లాడిన మాటలు ట్రోలర్స్ కు చేతినిండా పని కల్పించినట్లవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+