వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: స్థానిక సంస్థల వేళ..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో ఎక్కడైనా మద్యం..నగదు పంచితే అభ్యర్ధులను అనర్హలను చేసేలా చట్టం తెచ్చిన ప్రభుత్వం..ఇదే సమయంలో పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి కీలక మార్గదర్శకాలు చేశారు. ఏ జిల్లాలో అయినా మద్యం..నగదు పంపిణీ చేసినట్లుగా తేలితే అందుకు జిల్లా పోలీసు అధికారులే బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు.

ఇదే విషయాన్ని డీజీపీకి సైతం స్పష్టం చేసిన ముఖ్యమంత్రి ఇందులో అధికార పార్టీ నేతలు ఉన్నా ఉపేక్షించవద్దని సూచించారు. అందులో భాగంగా..స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కు ఒక రోజు ముందుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏకంగా 20 మంది అధికారులకు స్థాన చలనం కలిగింది. దీంతో..ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం..ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలు ఇప్పుడు అభ్యర్దులకే కాదు..పోలీసు అధికారులకూ టెన్షన్ కు కారణమవుతున్నాయి.

ఏపీ ప్రభుత్వం ఒకే విడతలో 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. అందులో సీనియర్ అధికారులు సైతం ఉన్నారు. పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ గా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యా రు. అదే విధంగా విశాఖ పోలీసు కమిషనర్ కు పదోన్నతి లభించింది. లీగల్ వ్యవహారాలను హరి కుమార్ కు అప్పగించారు.

Andhra Pradesh govt issues Go on transfer of IPS officers ahead of Local body polls

ఎస్ఐబి ఐజీగా సీహెచ్ శ్రీకాంత్ ను నియమించారు. ఏలూరు రేంజ్ ఐజీ ఏఎస్ ఖాన్ కు మెరైన్ బాధ్యతలు కేటాయించారు. జే ప్రభాకర రావును గుంటూరు రేంజ్ ఐజీగా నియమించారు. ఎక్సైజ్ శాఖ అదనపు డైరెక్టర్ గా ఇప్పటి వరకు గుంటూరు రేంజ్ ఐజీగా పని చేసిన వినీత్ బ్రిజ్ లాల్ కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

డి నాగేంద్ర కుమార్ ను ఐజీ, లాజిస్టిక్స్ కు కేటాయించారు. కొల్లి రఘురామిరెడ్డిని నిఘా విభాగపు డీఐజీగా పోస్టింగ్ ఇచ్చారు. ఏసీబీ అదనపు డైరెక్టర్ గా ఇప్పటి వరకు ఏసీబీలో ఉన్న అశోక్ కుమార్ కు కేటాయించారు.ఇంటలిజెన్స్ ఎస్పీగా విజయ్ కుమార్, సీఐడి డీఐజీగా హరి క్రిష్ట నియమితులయ్యారు. ఏసీబీ డీఐజీగా రవి ప్రకాశ్‌ను నియమించారు.

Recommended Video

Nara Lokesh Visits Help Hospital And Scolds AP CM Jagan || Oneindia Telugu

ఎస్వీ రాజశేఖర బాబుకు డీజీ కార్యాలయంలో లా అండ్ ఆర్దర్ కో ఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు.ఏలూరు రేంజ్ డీఐజీగా కేవీ మోహన్ రావును నియమించారు. గుంటూరు అర్బన్ ఎస్పీ రామక్రిష్ట ను పదోన్నతి కల్పిస్తూ అదే సమయంలో గుంటూరు ఎస్పీగా కొనసాగాలని ప్రభుత్వం ఆదేశించింది. నర్సీపట్నం ఓఎస్డీగా జీఎస్ సునీల్, మంగళగిరి 6వ పోలీసు బెటాలియన్ కమాండెంట్ గా బీ క్రిష్టారావు, కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గా అమిత్ బర్దార్, కర్నూలు ఏఎస్పీగా గౌతమీ సాలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

English summary
Just a head of local body elections, AP govt had issued a GO regarding the transfers of IPS officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X