'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆ రోజు రాకీభాయ్ విధ్వంసం..!

రాకింగ్ స్టార్ యశ్ కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ సినిమాల తర్వాత యశ్ కొంత గ్యాప్ తీసుకుని మరీ చేస్తున్న చిత్రం 'టాక్సిక్'.. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. జూన్ 4 నే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలతో చాలాసార్లు వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. టాక్సిక్ మూవీని ఆగస్టు 26వ తేదీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దాంతో రాకీభాయ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆ రోజు థియేటర్లు బద్దలే అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కేజీఎఫ్ 2 చిత్రం తర్వాత యశ్ చేస్తున్న సినిమా కావడంతో ఓ రేంజ్ లో ఆశలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ కు గీతూ మోహన్ దాస్ డైరెక్షన్‌ వహించారు. షూటింగ్ ఆలస్యం కావడం, అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ సర్దుబాట్ల వల్ల ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు మూవీ రిలీజ్ పై చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. ఆగస్టు 26 న ఈ చిత్రం కన్నడ, ఇంగ్లిష్​, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం వెర్షన్లలో విడుదల కానుంది.

Yash Starrer Toxic Gets New Release Date Movie Officially Set for August 26th Yash Toxic movie

ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. గోవా డ్రగ్ మాఫియా బ్యాక్‌ డ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. ఈ మూవీలో యశ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని సమాచారం. అలాగే 1940 నుండి 1970 కాలం నాటి గోవా తీర ప్రాంతంలో సాగే పవర్‌ ఫుల్ డ్రగ్ కార్టెల్ (మాఫియా) బ్యాక్‌ డ్రాప్‌ లో ఈ యాక్షన్ థ్రిల్లర్ ఉండబోతుందని తెలుస్తోంది. గీతూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆమె భర్త రాజీవ్ రవి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఇక కేజీఎఫ్ ఫ్రాంచైజీల తర్వాత, రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ మూవీలో నయనతారతోపాటు బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ , తారా సుతారియా, హుమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+