పదవీ విరమణ వయసు పెంపు, రంగం సిద్దం..!?

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్దం అవుతోంది. వైద్యవిద్యలో అధ్యాపకుల పదవీ విరమణ వయసును మరోసారి పెంచే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి తుది కసరత్తు జరుగుతోంది. దీంతో.. ప్రస్తుతం ఉన్న 65 ఏళ్ల రిటైర్‌మెంట్‌ వయసును 70 ఏళ్లకు పెరగనుంది. మెడికల్ కాలేజీల్లో ఉన్న అధ్యాపకుల కొరత అధిగమించేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన వెసులుబాటు మేరకు ఈ నిర్ణయం అమలుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం వైద్యవిద్యలో అధ్యాపకుల పదవీ విరమణ వయసును మరోసారి పెంచేందు కు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలు వైద్యశాఖకు చేరాయి. వైద్య ఆరోగ్యశాఖలోని వైద్యవిద్య సంచాలకుల(డీఎంఈ) పరిధిలో అధ్యాపకుల పదవీ విరమణ వయసును పెంచాలని భావిస్తోంది. మెడికల్‌ కాలేజీల్లో అధ్యాపకుల కొరతను అధిగమించాలంటే రిటైర్‌మెంట్‌ వయసును 70 ఏళ్లకు పెంచుకోవచ్చని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సూచించింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పెంచారు. తెలంగాణలో గతంలో మెడికల్‌ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును రెండుసార్లు పెంచారు. మొదట 58 నుంచి 61 ఏళ్లకు పెంచగా.. 2019 జూన్‌లో రెండోసారి 65 ఏళ్లకు పెంచారు. మరోసారి పెంచేందుకు ఉద్దేశించిన ఫైల్‌ను వైద్య ఆరోగ్యశాఖ సర్క్యులేషన్‌లోకి తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగానే దానిని సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం కోసం పంపనున్నారు.

 రేపు ఢిల్లీకి వస్తున్నా, మీదే బాధ్యత- రేవంత్ బిగ్ ట్విస్ట్..!!
రేపు ఢిల్లీకి వస్తున్నా, మీదే బాధ్యత- రేవంత్ బిగ్ ట్విస్ట్..!!
telangana-govt-likely-to-extend-the-retirement-age-for-professors-in-medical-education-as-reports

తుది నిర్ణయం పై ప్రభుత్వం కసరత్తు

కాగా.. తెలంగాణలో 35ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలున్నాయి. ఇందులో 4,090 ఎంబీబీఎస్‌ (యూజీ), 1,298 పీజీ, 110వరకు సూపర్‌ స్పెషాలిటీ సీట్లు ఉన్నాయి. వైద్య కళాశాలల్లో 60 శాతం అధ్యాపకుల కొరత ఉంది. దానికితోడు ఈ ఏడాది సుమారు 25-30 మంది ప్రొఫెసర్లు పదవీ విరమణ చేయబోతున్నారు. ఒకవైపు కొరత, మరోవైపు ఉన్నవారు పదవీ విరమణ చేయడం, కాంట్రాక్టులోనూ దొరక్కపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రిటైర్‌మెంట్‌ వయసును పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. మెడికల్‌ కాలేజీల్లో ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు అధ్యాపకులు లేకుంటే ఉన్న పీజీ సీట్లకు కోత పడుతుంది. కొత్త వైద్య కళాశాల్లో మరికొన్ని పీజీ సీట్ల కోసం కూడా సర్కారు దరఖాస్తు చేసింది. ఇప్పుడు ఉన్న సీట్లను కాపాడుకొని, కొత్తవి తెచ్చుకోవాలంటే కచ్చితంగా ప్రొఫెసర్లు సరిపడినంత మంది ఉండాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రతిపాదన పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో.. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+