కోడలిని కాపాడబోయి అత్తామామలు మృతి.. ఏపీలో విషాదం

నెల్లూరు జిల్లాలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. కోడలిని విద్యుదాఘాతం నుంచి కాపాడేందుకు ప్రయత్నించిన అత్తామామలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన సైదాపురం మండలం చాగణం రాజుపాలెం ఎగువ సంఘంలో జరిగింది. ఊహించని ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది.

సంతోషంగా ఉన్న కుటుంబంలో ఊహించని ఘటన

ఇండ్ల రవి, సునీత దంపతులు సాధారణ కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వివాహం అయి వేరుగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు వంశీ తల్లిదండ్రులతోనే ఉంటూ, కొన్ని నెలల క్రితం చెంచమ్మ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కుటుంబం అన్యోన్యంగా జీవితం సాగిస్తోంది.శనివారం ఉదయం చెంచమ్మ ఇంటి వరండాలో ఉతికిన బట్టలు ఆరేస్తోంది.

death news In-Laws Died While Trying to Save Daughter-in-Law from Electric Shock in Nellore

కోడలిని కాపాడబోయి ప్రాణాలు పోగొట్టుకున్న అత్తామామలు

ఆ సమయంలో అక్కడ ఉన్న ఇనుప తీగపై తడి దుస్తులు వేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఆమె కింద పడిపోయింది. కోడలు క్రింద పడిపోవటం చూసిన అత్త సునీత, మామ రవి వెంటనే పరుగెత్తుకొని వచ్చి కోడలిని కాపాడే ప్రయత్నంలో ఆ ఇనుప తీగను తొలగించడానికి ప్రయత్నించారు. దురదృష్టవశాత్తు వారు కూడా విద్యుదాఘాతానికి గురై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.

స్వల్ప గాయాలతో బయటపడిన కోడలు

కోడలు చెంచమ్మకు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు మరియు కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి ఆస్పత్రికి తరలిద్దాం అని చూసేసరికే అత్తా మామలు విగత జీవులు కాగ, కోడలిని ఆస్పత్రికి మృతదేహాలను గుర్తించారు. ఈ వార్త వినగానే గ్రామంలో విషాదం వ్యాపించింది. దంపతులు కాయకష్టంతో కుటుంబాన్ని నడిపించి, పిల్లలను కంటికి రెప్పలా చూసి పెంచి, వారికి పెళ్లిళ్లు చేసి ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఈ దుర్ఘటన జరగడం గ్రామస్తులను కలచివేసింది.

హైదరాబాద్‌లో వరద ముప్పు నివారణకు హైడ్రా యాక్షన్ ప్లాన్... 24 గంటలూ హైడ్రా సైన్యం సిద్ధం!
హైదరాబాద్‌లో వరద ముప్పు నివారణకు హైడ్రా యాక్షన్ ప్లాన్... 24 గంటలూ హైడ్రా సైన్యం సిద్ధం!

వర్షాకాలం విద్యుత్ విషయంలో జాగ్రత్త

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా స్థలాన్ని పరిశీలించి, ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటని పరిశీలించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా తడి దుస్తులు ఆరేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కోడలిని కాపాడుకోవడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన అత్తామామల చర్య గ్రామస్తులను కన్నీరు కార్చిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+