ఉత్తరాది యువకుల వేధింపులు తట్టుకోలేక రైల్లో నుంచి దూకిన మహిళా టెక్కీ

యువకుల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా టెక్కీ రైలులో నుంచి దూకిన సంఘటన ఏపీలో చోటు చేసుకుంది. కేరళ నుంచి ఢిల్లీ వెళ్తున్న నిజాముద్దీన్ మిలీనియం ఎక్స్‌ప్రెస్ నుంచి ఆమె దూకింది.

Recommended Video

    Techie Jumps Off Train To Escape Harassment యువకుల వేధింపులు తట్టుకోలేక రైలులో నుంచి దూకిన మహిళ

    తిరుపతి: యువకుల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా టెక్కీ రైలులో నుంచి దూకిన సంఘటన ఏపీలో చోటు చేసుకుంది. కేరళ నుంచి ఢిల్లీ వెళ్తున్న నిజాముద్దీన్ మిలీనియం ఎక్స్‌ప్రెస్ నుంచి ఆమె దూకింది.

    దీంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ సంఘటన సింగరాయకొండ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. విజయవాడకు చెందిన యువతులు చెన్నైలో సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. బక్రీద్ పండుగకు గురువారం వారు చెన్నై నుంచి మిలీనియం ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు బయలుదేరారు.

     Andhra Pradesh: Harassed techie jumps off train

    అదే రైలులో ప్రయాణిస్తున్న ఉత్తరాదికి చెందిన ముగ్గురు యువకులు వీరిని ర్యాగింగ్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి లోనైయ్యారు.

    రైలు సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో నిలుపుదల లేనందున నెమ్మదిగా ప్రయాణిస్తుండగా షేక్ అజ్మల్ అనే యువతి తీవ్ర మనస్థాపానికి లోనై రైలులో నుంచి దూకేసింది.

    వెంటనే వారి స్నేహితులు రైలు చైన్ లాగి రైలును ఆపారు. గాయాలు పాలైన అజ్మల్‌ను రైల్వే సిబ్బంది 108 సహాయంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+