జోగి రమేష్ లాయర్ కు హైకోర్టు సూటి పశ్నలు, బెయిల్ మాత్రం ఇవ్వకండి సార్

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్ ను కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు మీరు ఎలా సమాధానాలు చెబుతారు అంటూ సీనియర్ న్యాయవాది, మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి పక్కన మీరు కూర్చుని పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కరెక్టేనా అని హైకోర్టు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ప్రశ్నించింది.

తన క్లైంట్ జోగి రమేష్ కి పోలీసులు మూడుసార్లు నోటీసులు జారీ చేశారని, అందుకే తాను ఆయన వెంట వెళ్లానని పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టుకు చెప్పారు. 20 ఏళ్ల క్రిందట ఐడియా ఫోన్ కంపెనీకి సిమ్ కార్డు నెంబర్ కోసం జోగి రమేష్ దరఖాస్తు చేసుకున్నారని, ఆ పేపర్ మీ దగ్గర ఉందా అని పోలీసులు ప్రశ్నించారని, అన్ని సంవత్సరాల క్రితం ఐడియా కంపెనీకి ఇచ్చిన ఆ పేపర్లు జోగి రమేష్ దగ్గర ఎలా ఉంటాయని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో వాదించారు.

Andhra Pradesh High Court directly questioned Jogi Ramesh s lawyer Sudhakar Reddy

ఐఎంఈఐ నెంబర్ అంటే ఏమిటి అని జోగి రమేష్ ను పోలీసుల ప్రశ్నించారని, ఐఎంఈఐ నెంబర్ అంటే జోగి రమేష్ కు తెలియదని తాను పోలీసు అధికారులకు సమాధానం చెప్పానని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టు ముందు వివరణ ఇచ్చారు. పోలీసులు మూడుసార్లు జోగి రమేష్ కు నోటీసులు జారీ చెయ్యడంతో తాను మానవతా దృక్పథంతోనే ఆయన వెంట పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, అంతేకాని తనకు వేరే ఉద్దేశం లేదని పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టుకు చెప్పారు.

పోలీసులు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు ప్రశ్నిస్తున్న సమయంలో ఆయన పక్కనే సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుర్చోకూడదని కోర్టుకు చెప్పారు. జోగి రమేష్ కనపడే అంత దూరంలో ఆయన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూర్చుంటే పోలీసులకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని పోలీసుల న్యాయవాదులు కోర్టుకు చెప్పారు.

అలాకాకుండా నిందితుడు జోగి రమేష్ పక్కనే కూర్చుని పోలీసులు అడిగే ప్రశ్నలకి ఆయన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎలా సమాధానం చెబుతున్నారని పోలీసుల తరపున న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. జోగి రమేష్ పక్కన సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూర్చోవడానికి వీలు లేదని పోలీసులు తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టుకు చెప్పారు

Andhra Pradesh High Court directly questioned Jogi Ramesh s lawyer Sudhakar Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై జరిగిన దాడి కేసులో జోగి రమేష్ నిందితుడు అని, ఆయనకు బెయిల్ ఇస్తే సమాజంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఆయన బెయిల్ పిటిషన్ కొట్టి వేయాలని పోలీసుల తరఫున న్యాయవాదులు హైకోర్టుకు మనవి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన ఇంటిపై దాడి జరిగింది.

చంద్రబాబు ఇంటిపై దాడి జరిగిందని 2021లో తాడేపల్లి పోలీసులు అనేక మందిపై కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.. ఈ కేసులోనే మాజీ మంత్రి జోగి రమేష్ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పోలీసుల తరఫున న్యాయవాదులు హైకోర్టుకు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పూర్తి కావడంతో సెప్టెంబర్ 3వ తేదీన తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+