Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాసుదేవరెడ్డి చిక్కితే ఆ వైసీపీ నాయకుల వాస్తు మారిపోతుందా, ఏం జరుగుతుంది!

ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి కోసం సీఐడీ పోలీసులు వెతుకుతున్నా ఆయన ఆచూకీ మాత్రం ఇంతవరకు చిక్కలేదు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాత్రికి రాత్రే విజయవాడలోని ఏపీఎండీసీ గెస్ట్ హౌస్ ను ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్ళిపోయిన ఏపీఎండీసీ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి ఆ తర్వాత ఎవరికీ కనపడకుండా అదృశ్యం అయ్యారు.

వాసుదేవ రెడ్డి కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో వెతికినా ఆయన అడ్రస్ మాత్రం చిక్కడం లేదని సీఐడీ అధికారులు అంటున్నారు. పొరుగు సేవలపై ఏపీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వాసుదేవ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ వ్యాపారంలో అన్నీ తానై వ్యవహరించారని, ఎక్సైజ్ శాఖ అధికారుల సూచనలు, సలహాలు ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.

Andhra Pradesh Liquor Scam King Pin Vasudeva Reddy s whereabouts are unknown

వాసుదేవ రెడ్డి హయాంలోనే ఆంధ్రప్రదేశ్ లో చిత్ర విచిత్రమైన లిక్కర్ బ్రాండ్లు తెరమీదకు వచ్చాయి. అంతవరకు మద్యం వ్యాపారం చేస్తున్న ప్రముఖ లిక్కర్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కనిపించడకుండా పోయాయి. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో కొన్ని డిస్లరీ కంపెనీలను లీజ్ కు తీసుకున్న కొందరు వైసీపీ నాయకులు సొంత బ్రాండ్లతో మద్యం తయారు చేసి ఆ రాష్ట్రంలోని ప్రజలకు విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి.

నాసిరకం మద్యం తయారుచేసి పేదలకు విక్రయించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడారని అప్పట్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతోపాటు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత సోదరి వైయస్ షర్మిల కూడా పదేపదే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ చిత్తుగా ఓడిపోయి తరువాత ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే సీఎం చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వం లో జరిగిన మద్యం వ్యాపారం గురి ఆరా తీశారు.

Andhra Pradesh Liquor Scam King Pin Vasudeva Reddy s whereabouts are unknown

అక్టోబర్ 1వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీ అమలులోకి వస్తుంది. దేశంలో విక్రయించే పాత లిక్కర్ బ్రాండ్ లు ఆంధ్రప్రదేశ్ లో విక్రయించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అంతలోపే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం లావాదేవీల స్కామ్ కేసు వ్యవహారం కొలిక్కి తీసుకురావాలని అనుకుంటున్న సీఐడీ అధికారులు ఏపీఎండీసీ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి కోసం గాలిస్తున్నారు.

అయితే కేసు నమోదు అయిన వెంటనే వాసుదేవ రెడ్డి ఎవరికీ కనిపించకుండా పారిపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఒక ప్రభుత్వ అధికారి ఆయన పై అధికారులకు, ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇన్ని రోజులు పారిపోవడం కూడా నేరమే అని, ఇప్పటికే ఆయన ఇంటికి నోటీసులు కూడా అంటించామని, అయినా కూడా ఆయన నుండి ఎలాంటి స్పందన లేదని సీఐడీ అధికారులు అంటున్నారు.

Andhra Pradesh Liquor Scam King Pin Vasudeva Reddy s whereabouts are unknown

ఏపీఎండీసీ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి హయాంలో వేలాది కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పటికే కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు వీలైనంత త్వరగా వాసుదేవ రెడ్డిని పట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సీఐడీ అధికారులకు వాసుదేవరెడ్డి చిక్కితే వైసీపీకి చెందిన కొందరు నాయకుల వాస్తులు కూడా మారిపోతాయని, మొత్తం వ్యవహారం బయటకు వస్తుందని ఓ పోలీసు అధికారి అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+