ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు, ఒక్క రోజులోనే - తాజా ఆదేశాలు..!!
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే ఏడు కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 26కి చేరింది. ప్రస్తుతం పది మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా... తొమ్మిది మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ముగ్గురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ నలుగురు మరణించారు. కాగా, రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో క్రమేణా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా బయట పడిన ఏడు కేసుల్లో గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరిలో 2, బాపట్లలో ఒక కేసు వెలుగు చూసినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో.. మొత్తం కేసులు 26కు చేరాయి. పది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలను వేగవంతం చేసింది. రాష్ట్రంలోని 17 బోధనాస్పత్రుల్లో మొత్తం 255 ప్రత్యేక కొవిడ్ పడకలను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. బోధనాస్పత్రుల్లో 6,77,939 ట్రిపుల్ లేయర్ మాస్కులు, సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో 5.26 లక్షల మాస్కులు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటితో పాటు 58,790 ఎన్-95 మాస్కులు, 4436 పీపీఈ కిట్లు, 2572 శానిటైజర్లు అందుబాటులో ఉంచామని అధికారులు వివరించారు.

ప్రభుత్వం ముందస్తు చర్యలు
ఇక, పర్యాటక ప్రాంతాల వద్ద కొత్త ఆంక్షలు అమల్లోకి తెస్తున్నారు. సీలేరు పవర్ కాంప్లెక్స్ పరిధిలో సందర్శకుల అనుమతి రద్దు చేసారు. విద్యుత్ కేంద్రాల్లో సిబ్బందికి కొవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. తాజాగా నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌ను గుర్తించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఈ వేరియంట్ తో ఆందోళన అవసరం లేని.. అయితే, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆర్‌ఎఫ్.5 లక్షణాలు ఇతర ఒమిక్రాన్ ఉప-వేరియంట్ల లక్షణాల మాదిరిగానే ఉంటాయని తెలిపారు. ముఖ్యoగా గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, అలసట, శరీర నొప్పులు ఉంటాయని పేర్కొన్నారు. అయితే, రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు ధరించటం.. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications