వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 6వేల మార్క్ దాటింది, 84కు చేరిన మృతులు

|
Google Oneindia TeluguNews

అమరావతి: కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 15,633 మంది నమూనాలు పరీక్షించగా 294 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. అయితే, వీరిలో విదేశాల నుంచి వచ్చినవారు ఇద్దరు ఉండగా, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 39 మంది ఉన్నారు.

రాష్ట్రంలో కరోనా నిర్ధారణ అయిన వారి సంఖ్య 253గా ఉంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6152కు చేరింది. కరోనా కారణంగా గడిచిన 24గంటల్లో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 84కు చేరింది.

Andhra Pradesh tally crosses 6000-mark with 294 new COrona cases

ఇక విదేశాల నుంచి వచ్చిన వారిలో 204 మందికి కరోనా పాజిటివ్ రాగా, ప్రస్తుతం
181 యాక్టివ్ కేసులున్నాయి. ఆదివారం ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపికి వచ్చిన వారిలో 1107 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో 537 పాజిటివ్ కేసులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఒక్కరోజే 48 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇప్పటి వరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2723కి చేరింది. ప్రస్తుతం వివిధ కోవిడ్ ఆస్పత్రుల్లో 2034 మంది చికిత్స పొందుతున్నారు.

Recommended Video

Family Recovered From Corona Without Going To Hospital

ఏపీలో కరోనాకు సంబంధించిన అధికారిక సమాచారం కావాలంటే.. వాట్సాప్ చాట్ బాట్ నెంబర్ 8297-104-104‌కు hi, hello, covid అని మెసేజ్ చేయండి. స్మార్ట్ ఫోన్ లేనివారు 8297-104-104
నెంబర్ కు ఫోన్ చేసి IVRS ద్వారా కూడా సమాచారం పొందవచ్చు. వైద్య సాయం కోసం 14400కు ఫోన్ చేయవచ్చు.

English summary
The number of coronavirus cases in Andhra Pradesh has crossed 6000-mark after the state registered a huge spike till Sunday. With 294 new cases, the state tally has reached 6152.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X