అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ప్రధాని మోదీ కీలక ప్రకటన!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని భారత్ ఘనంగా స్వాగతించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ మైలురాయిని ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, చర్చల పునరుద్ధరణకు ఓ కీలకమైన అడుగుగా అభివర్ణించారు. వివాదాలు ఏవైనా వాటిని చర్చలు, దౌత్యపరమైన వ్యూహాల ద్వారానే పరిష్కరించుకోవాలనే సిద్ధాంతానికి భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ ఒప్పందంతో అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గి ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం పెరుగుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచ దేశాలకు ఊరట
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ఈ శాంతి ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ఇది కేవలం ఆ రెండు దేశాలకే కాకుండా ప్రపంచ స్థిరత్వానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియాలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక అస్థిరత ఏర్పడిందని.. ఎన్నో దేశాలు భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలను చవిచూశాయని ప్రధాని గుర్తుచేశారు. ఈ ఒప్పందం సమర్థవంతంగా అమలు కావడం ద్వారా ఆయా ప్రాంతాల్లో మళ్లీ శాంతిభద్రతలు నెలకొంటాయని.. అంతర్జాతీయ వాణిజ్యానికి ఇది ఎంతో దోహదుపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

PM Narendra Modi Welcomes US-Iran Peace Agreement Donald Trump Orders Opening of Strait of Hormuz

స్వేచ్ఛా వాణిజ్యం, సముద్రయాన భద్రతకు భరోసా
ఈ ఒప్పందం ద్వారా పశ్చిమ ఆసియా పరిధిలోని సముద్ర మార్గాల్లో స్వేచ్ఛా నౌకాయానం, అంతర్జాతీయ వాణిజ్య భద్రతకు పూర్తి భరోసా లభిస్తుందని ప్రధాని ఆశించారు. భౌగోళిక రాజకీయాల పరంగా ఈ సముద్ర మార్గాలు ప్రపంచ రవాణాకు అత్యంత కీలకమైనవని, అక్కడ శాంతి నెలకొనడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రెండు దేశాల మధ్య ఇంకా ఏవైనా పరిష్కారం కాని సమస్యలు మిగిలి ఉంటే.. వాటిని కూడా ఇరుపక్షాలు కూర్చొని పరస్పర చర్చల ద్వారా శాశ్వత, తుది పరిష్కారానికి వచ్చేలా కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించారు.

డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
మరోవైపు అమెరాకా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందంపై తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందించారు. ఈ శాంతి ప్రకటనను ఓ గొప్ప విజయంగా ఆయన అభివర్ణించారు. ఇరాన్‌తో ఒప్పందం ఇప్పుడు పూర్తిగా ముగిసిందని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా తెరవడానికి ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు. అలాగే ఇరాన్ పై అమెరికా నౌకాదళం విధించిన దిగ్బంధనాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓడలు తమ ఇంజన్లను స్టార్ట్ చేసి చమురు సరఫరాను యథావిధిగా పునరుద్ధరించవచ్చని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.

స్లోవేకియా పర్యటనలో ప్రధాని మోదీ
ప్రస్తుతం స్లోవేకియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడ పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్లోవేకియా ప్రధానమంత్రితో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, వ్యూహాత్మక రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించనున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ 'టాంబ్ ఆఫ్ ది అన్‌నోన్ సోల్జర్' స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పిస్తారు. అనంతరం డాన్యూబ్ నదిపై నిర్వహించే ప్రత్యేక హై-టీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం స్లోవేకియా అధ్యక్షుడితో కీలక భేటీ ముగిసిన తర్వాత,అధ్యక్షుడు ఇచ్చే డిన్నర్‌తో ప్రధాని పర్యటన ముగుస్తుంది.

వందేమాతరంతో ప్రధానికి ఘనస్వాగతం
స్లోవేకియా చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడి ప్రభుత్వం, భారతీయ సమాజం ఘనస్వాగతం పలికాయి. ప్రధాని స్వాగత వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు స్లోవేకియాకు చెందిన ప్రముఖ సాంస్కృతిక బృందం 'లుస్నికా ఎన్సెంబుల్' అద్భుతమైన శైలిలో 'వందేమాతరం' గీతాన్ని ఆలపించింది. ఈ ప్రదర్శనలో భారతీయ సంస్కృతి, స్లోవాక్ జానపద సంప్రదాయాల అపూర్వ సంగమం కనిపించింది. ప్రధాని మోదీ స్వయంగా ఆ కళాకారులను కలిసి అభినందించారు. ఇక స్లోవేకియాలో నివసిస్తున్న భారతీయ సంతతి ప్రజలు ప్రధానిని చూడగానే మోదీ-మోదీ, వందేమాతరం, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తూ విమానాశ్రయం పరిసరాలను హోరెత్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+