రీఎంట్రీకి విరాట్ కోహ్లీ రెడీ: కన్ ఫర్మ్ చేసిన అజిత్ అగార్కర్
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతోంది. ఓ టెస్ మ్యాచ్, మూడు వన్డేల సిరీస్ లో ఆ దేశ జట్టును ఎదుర్కొంటోంది. ఇప్పటికే టెస్ట్, తొలి వన్డే కూడా ముగిసింది. ఈ రెండూ భారత్ ఖాతాలోనే పడ్డాయి. ఈ సిరీస్‌లోని తదుపరి మ్యాచ్‌లు 17న లక్నో, 20న చెన్నైలో జరగనున్నాయి. ఈ వన్డే సిరీస్ ముగిసే సయానికి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ప్రధాన జట్టును సెలెక్టర్లు అధికారికంగా ప్రకటించనున్నారు.
దీని తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది టీమిండియా. దీనికి సంబంధించి జట్టును ఎంపిక చేసేందుకు జాతీయ సెలెక్టర్లు సిద్ధమవుతున్నారు. ఈ వారంలోనే వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్‌కు ఆటగాళ్లను ప్రకటించే అవకాశం ఉంది. సీనియర్ల ఫామ్, యువ ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా సమతుల్యమైన జట్టును ఎంపిక చేయడమే లక్ష్యంగా సెలెక్షన్ కమిటీ కసరత్తు చేస్తోంది. ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా కొందరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే యోచనలో ఉన్నారు.

భారత జట్టు త్వరలో సుదీర్ఘ యూకే పర్యటనకు వెళ్లనుంది. ఈ నెల 26, 28 తేదీల్లో బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం జూలై 1 నుంచి 11 వరకు ఇంగ్లాండ్‌తో అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జట్లు తలపడతాయి. ఆ తర్వాత జూలై 14 నుంచి 19 వరకు ఇంగ్లాండ్‌తోనే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ తో టీ20ల కోసం ఇప్పటికే జట్టు ఎంపికైన విషయం తెలిసిందే. ఇక వన్డేల కోసం జట్టును ఖరారు చేయాల్సి ఉంది.
ఈ సిరీస్ కోసం విరాట్ కోహ్లీ జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించారు. వన్డే సిరీస్ ఆరంభం అయ్యే నాటికి కోహ్లీ పూర్తి ఫిట్ నెస్ సాధించవచ్చని, జట్టు ఎంపిక కోసం అతని పేరును పరిశీలనలోకి తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు కోహ్లీ. దీనివల్ల ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు దూరమయ్యాడు.
దీంతో సెలెక్టర్లు అతని స్థానంలో లెఫ్ట్ హ్యాండర్ యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. కోహ్లీ వేగంగా కోలుకుంటున్నాడని, త్వరలోనే మైదానంలోకి తిరిగి ప్రవేశిస్తాడని టీమ్ మేనేజ్‌మెంట్ ధీమా వ్యక్తం చేసింది. కోహ్లీతో పాటు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వగా, హార్దిక్ పాండ్యా కూడా మైదానంలోకి రాలేదు. సీనియర్ల గైర్హాజరీ కారణంగా టీమిండియా మేనేజ్‌మెంట్ తమ బెంచ్ బలాన్ని పరీక్షించేందుకు ఈ స్వదేశీ సిరీస్‌ను వేదికగా మలుచుకుంది.












Click it and Unblock the Notifications