ఏపీ Vs తెలంగాణ: అంతా రహస్యమే, ఆ 80వేల ఫైళ్లలో ఏముంది?
హైదరాబాద్: హైదరాబాద్ సచివాలయం నుంచి పైళ్లను తరలించడం ఏపీ ప్రభుత్వానికి కష్టంగా మారింది. ఈ పైళ్ల తరలింపు వ్యవహారం కాస్తంత గందరగోళంగా ఏర్పడిందన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుత సచివాలయంలో ఉన్న రికార్డ్ లైబ్రరీ, సెంట్రల్ రికార్డు బ్రాంచ్, న్యాయశాఖ లైబ్రరీ, ప్లానింగ్ లైబ్రరీ విభాగాల్లోనే రెండు రాష్ట్రాలకు చెందిన కీలకమైన ఫైళ్లన్నీ ఉన్నాయి.
ఈ పైళ్లలో ఎక్కువ భాగం భూ కేటాయింపులు, పారిశ్రమల స్థాపన, ఆర్ధిక కేటాయింపులతో పాటు గెజిట్, చట్టాలకు సంబంధించిన పైళ్లే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పైళ్ల సంఖ్య వేలల్లో ఉన్నప్పటికీ ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు సంబంధించి పలు పైళ్లను కేటాయించారు. అయితే మిగతా 80,000 పైళ్ల కోసం ఇరురాష్ట్రాల మధ్య కాస్తంత గందరగోళం ఏర్పడింది.

ఏపీ రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో ఏపీ ప్రభుత్వం తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన పైళ్లను తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. జూన్ 2014లో రాష్ట్ర విభజన జరిగే సమయానికి సచివాలయంలో మొత్తం 3,35,383 పైళ్లు ఉన్నాయి.
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు 1,31,509 పైళ్లను కేటాయించగా, తెలంగాణకు 1,20,260 కేటాయించారు. మిగతా 83,614 ఫైళ్ల గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వీటిల్లో 78,626 పైళ్లు ఇరు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా, మిగతా 4,988 పైళ్లు అటు ఏపీకి, ఇటు తెలంగాణకు సంబంధించినవి కాక పోవడం విశేషం.
ఏపీ సర్కార్ కు కొత్త తలనొప్పి : 'ఉద్యోగుల తరలింపు ఓకె.. ఫైళ్లతో వచ్చింది సమస్య..'
అయితే ప్రస్తుతం ఈ ఫైళ్ల ఎవరికి కేటాయించాలనేది పెద్ద సమస్యగా మారింది. ఈ పైళ్లలో అత్యధికం అత్యంత రహస్యమైనవి కావడంతో ఇరు రాష్ట్రాలు కూడా మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలని పోటీ పడుతున్నాయి. ఉమ్మడి ఏపీలో భాగంగా రాష్ట్రంలోని వివిధ సంస్ధలకు జరిగిన భూ కేటాయింపులు, ఎన్ఓసీలు, ఆర్ధిక నిధులు, అసైన్డ్ భూములు, ప్రాజెక్టులు, సీఎం రిలీఫ్ ఫండ్, ఏసీపీ, విజిలెన్స్ కేసులు, ఆఫీసర్ల ప్రమోషన్లు ఉండటం విశేషం.
గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ సచివాలయంలో ఉన్న ఈ ఫైళ్లకు పట్టిన దుమ్మును ఇప్పుడు దులిపిన అధికారులు మాకు చెందాలంటే మాకు చెందాలంటూ గొడవకు దిగడానికి పెద్ద కారణమే ఉంది. భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు వీటిని కోర్టుల్లో సాక్ష్యంగా చూపించొచ్చనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వాలు గతంలో పలు విద్యా, పారిశ్రామిక సంస్ధలకు రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూ కేటాయింపులు జరిపాయి. దీంతో హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న నల్గొండ, మెదక్ జిల్లాల రియల్ ఎస్టేట్ రంగాన్ని విస్తరించారు. దీంతో పాటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఈ భూ కేటాయింపులు జరిగాయి.
ఈ నేపథ్యంలో ఈ ఫైళ్ల కోసం ఇరు రాష్ట్రాలు గొడవకు దిగాయి. ముఖ్యంగా ఉమ్మడి ఫైళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాతే ఏపీ ప్రభుత్వం తమ ఫైళ్లను తీసుకెళ్లాలంటూ తెలంగాణ ఉద్యోగులు ఫైళ్ల తరలింపు ప్రక్రియకు అడ్డుపడుతున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications