AP Rains: ఏపీకి చల్లని కబురు-రేపటి నుంచి ఇక వర్షాలు..!
దేశంలోకి అడుగుపెట్టిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు అనుకున్న విధంగానే విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లోనే ఏపీలో వర్షాలు మొదలు కాబోతున్నాయి. రేపటి నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఆ తర్వాత వరుసగా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.
ప్రస్తుతం దేశంలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్ధితులు కనిపిస్తున్నట్లు వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. రేపు ఏపీలో ఒకటి రెండు చోట్ల తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, క్రమంగా ఎల్లుండి నుంచి ఇక వీటి ప్రభావం రాష్ట్రం మొత్తానికి విస్తరిస్తుందని అంచనా. అంటే మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు దక్షిణ కోస్తా జిల్లాలో ప్రస్తుతం ఉన్న వడగాల్పులు, ఉక్కపోత పరిస్ధితులు కూడా రెండు, మూడు రోజుల్లో సాధారణంగా మారబోతున్నాయని అంచనా. వచ్చే వారంలో రుతుపవనాల ప్రభావంతో కోస్తాలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి. ప్రస్తుతం రోహిణి కార్తీ ప్రభావంతో ఎండలు మండుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురవడం ప్రారంభమైతే అన్ని ప్రాంతాలు చల్లబడే అవకాశముంది. దీంతో వర్షాల కోసం జనం ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications