Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంధ్రాలో అంతు చిక్కని ఓటరు నాడి, కాళ్లు పట్టుకున్న లీడర్స్, కాలర్ ఎగరేస్తున్న ఓటర్, ఇది లెక్క !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న సందర్బంగా నాయకులు నిమిషం తీరికలేకుండా పని చేస్తున్నారు. అధికారం కోసం వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పని చేస్తున్న తీరు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే ఎన్నికల కోసం అన్ని పార్టీల నాయకులు ఓటర్ల కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్దం అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని పలు నియోజక వర్గాల్లో అధికార వైసీపీ అభ్యర్థులు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటు విలువైనదే అని తెలుసున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు మాకే ఓటు వెయ్యాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో చాలా తేడా కనిపిస్తోంది.

Andhra Pradesh voters are careful not to come out as being in favor of any party

గతంలో పట్టణాలు, గ్రామాల్లోని ఓటర్లు పలానా పార్టీకి అనుకూలం అని కచ్చితంగా తెలిసిపోయేది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పట్టణాలు, గ్రామాల్లోని ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేస్తారు అంటూ కొంత వరకు అంచనా వేసినా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆ ఓటర్ల నాడి తెలుసుకోవడం అన్ని పార్టీల నాయకులకు పెద్ద తలనొప్పిగా తయారైయ్యిందని తెలుస్తోంది. నాయకుల విషయంలో జాగ్రత్త పడిన ఓటర్లు సైలెంట్ ఆపరేషన్ కు తెరలేపుతున్నారని తెలిసింది.

ఉదయం నుంచి రాత్రి వరకు ఎమ్మెల్యే అభ్యర్థుల వెంట తిరుగుతున్న కార్యకర్తలు కూడా పోలింగ్ రోజు అదే పార్టీకి ఓటు వేస్తారనే గ్యారెంటీ లేకుండా పోయిందని కొందరు నాయకులు అంటున్నారు. ఎన్నికల ప్రచారం చేస్తే ప్రతిరోజు రూ 500 నుంచి రూ 1,000 ఇస్తామని, ఉదయం టిఫిన్, మద్యాహ్నం బిర్యానీ, రాత్రి డబ్బుతో పాటు మద్యం బాటిల్ ఇస్తామని చెప్పి వెంట పిలుచుకుని వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Andhra Pradesh voters are careful not to come out as being in favor of any party

ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎన్నికల ప్రచారం చేస్తున్న కొందరు రాజకీయ నాయకులు ఇంటికి వెళ్లే సమయంలో వెంట వచ్చిన కార్యకర్తలకు, కేవలం డబ్బు కోసమే ఎన్నికల ప్రచారం చేస్తున్న వాళ్లకు డబ్బులు, మద్యం పంపిణి చేసి వెళ్లిపోతున్నారు. ఉదయం నిద్రలేచిన తరువాత మళ్లీ అదే తతంగం మొదలౌతోంది. ఒక్క ఓటు కూడా పక్కకుపోకుండా నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇంతకాలం మనల్ని లెక్కలో కూడా లేకుండా మాట్లాడిన నాయకులకు ఈసారి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో సినిమా చూపించాలని ఓటర్లు డిసైడ్ అవుతున్నారని తెలిసింది. అయితే ఎక్కడా నోరు జారకుండా జాగ్రత్త పడుతున్న ఓటర్లు పలు నియోజక వర్గాల్లో సైలెంట్ గా ఉండిపోయి పోలింగ్ రోజు మన పవర్ చూపించాలని ఓపికగా ఉన్నారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఎవరిని ఆదరిస్తారో అని విషయం జూన్ 4వ తేదీన తేలిపోతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+