తీవ్ర ప్రభావం: అమరావతి నిర్మాణంపై బాబుకు హెచ్చరిక!
అమరావతి: శాస్త్రీయ అధ్యయనం చేయకుండా రాజధాని అమరావతి నిర్మాణం సరికాదని ఇనిస్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (ఐహెచ్డీ) న్యూఢిల్లీ ప్రొఫెసర్ అమితాబ్ కుందూ ఆదివారం నాడు అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
పట్టణాభివృద్ధి నిపుణుల టీం ఒకటి ఆదివారం అమరావతిలో పర్యటించింది. అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని ఆ టీం తప్పుబట్టింది. ఈ టీంలో ఇనిస్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (ఐహెచ్డీ) న్యూఢిల్లీ ప్రొఫెసర్ అమితాబ్ కుందూ, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ప్రొఫెసర్ రామచంద్రయ్య తదితరులు ఉన్నారు.
వీరు వెలగపూడి గ్రామంలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించారు. వారు స్థానిక రైతులను కూడా కలిసి ముచ్చటించారు. అనంతరం వారు విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

మూడు పంటలు పండి పచ్చగా ఉండే ప్రాంతాన్ని కాంక్రీట్ జంగల్‌గా చేయడాన్ని వార తప్పుపట్టారు. రాజధానికి ఏ ప్రాంతం పనికి వస్తుందో.. శివరామకృష్ణన్ కమిటీ సూచనలు పట్టించుకోలేదన్నారు. ఇప్పటికే ఏపీలో రీజినల్ అసమానత ఉందని చెప్పారు.
రాజధానిని ఇక్కడ నిర్మిస్తూ చారిత్రక తప్పిదం చేస్తున్నారని చెప్పారు. అమరావతిని సింగపూర్, జపాన్‌లా చేస్తామని చెప్పడం సరికాదని, మన దేశ భౌగోళిక పరిస్థితులకు సింగపూర్, జపాన్‌లాంటి నిర్మాణ పద్ధతులు సరికాదన్నారు. ప్రభుత్వం మూడు పంటలు పండే పొలాలను రాజధాని కోసం తీసుకోవడం విడ్డూరమన్నారు. ఇక్కడ నిర్మాణాలు అమరావతి భవిష్యత్తుకు మంచిది కాదన్నారు. ఇక్కడ రాజధాని నిర్మాణం సరికాదన్నారు.
కాగా, రాజధానిలో, సీడ్ క్యాపిటల్లో మొత్తం... 23 ఎకరాలకు పైగా వరద నీటిలో మునుగుతుందని సీఆర్డీఏ తేల్చింది. ప్రభుత్వ వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. కోలో మీటర్ల విస్తీర్ణంలో ఎత్తైన ప్లాట్ ఫాంలను నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.750 కోట్లు ఖర్చు పెట్టనుంది. అయితే, దాదాపు 8 అడుగుల మేర నిర్మాణ ప్రాంతం ఎత్తు పెరగనుంది. రాజధానిలో మొత్తం వరద నీటి నియంత్రణ పనులు చేపట్టేందుకు వేలాది కోట్లు అవసరం.












Click it and Unblock the Notifications