Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాకెట్ ఇంధనం తయారీలో ప్రపంచ పటంలో నిలిచిన ఆంధ్రా షుగర్స్; ఇస్రో రాకెట్లకు ఇంధనం అక్కడి నుండే !!

ప్రపంచంలో తణుకు పట్టణానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంలో ఆంధ్ర షుగర్స్ కీలక పాత్ర పోషించింది. చక్కెర కర్మాగారంగా స్థాపించబడిన ఆంధ్ర షుగర్స్ ప్రస్తుతం చక్కెర ఉత్పత్తిని కొనసాగించనప్పటికీ రాకెట్ ఇంధనం తయారీ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో కీలక భూమిక పోషిస్తోంది. తణుకులోని ఆంధ్ర షుగర్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేస్తున్న రాకెట్ ప్రయోగాలలో ఆంధ్ర షుగర్స్ పోషిస్తున్న పాత్ర అందుకు ప్రధాన కారణం.

ఇస్రో తయారుచేస్తున్న రాకెట్లకు కావలసిన ద్రవరూప ఇంధనాన్ని అందిస్తున్న ఆంధ్రా షుగర్స్

ఇస్రో తయారుచేస్తున్న రాకెట్లకు కావలసిన ద్రవరూప ఇంధనాన్ని అందిస్తున్న ఆంధ్రా షుగర్స్

ఆంధ్ర షుగర్స్ భారతీయ అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి ఇస్రో తయారుచేస్తున్న రాకెట్లకు కావలసిన ద్రవరూప ఇంధనాన్ని రూపొందించడంలో విజయం సాధించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి చెరకు యొక్క ఉప ఉత్పత్తులను రాకెట్ ప్రొపెల్లెంట్ ఇంధనాలు, ఇథనాల్, మద్యం తయారీలో ఉపయోగించే రెక్టిఫైడ్ స్పిరిట్, విద్యుత్ ఉత్పత్తికి మరియు పేపర్ పరిశ్రమలో న్యూస్‌ప్రింట్ తయారీకి కూడా ముడిసరుకుగా ఉపయోగించబడుతోంది.

రాకెట్ లలో వినియోగించే ఇంధనాలను ఉత్పత్తి చేస్తున్న ఆంధ్రా షుగర్స్

రాకెట్ లలో వినియోగించే ఇంధనాలను ఉత్పత్తి చేస్తున్న ఆంధ్రా షుగర్స్

రాష్ట్రంలో పండే చెరకు క్రషింగ్ సమయం ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరించబడింది. ఒక రకం 10 నెలల్లో చూర్ణం అయితే, మిగిలిన రెండు వరుసగా 12 నెలలు మరియు 14 నెలల్లో చూర్ణం అవుతాయి. గోదావరి జిల్లాల్లో దాదాపు 75 వేల ఎకరాల్లో చెరకు సాగవుతుండగా, అందులో 10 శాతం ఐడీ లిక్కర్‌కు ముడిసరుకు అయిన నల్లబెల్లం తయారీకి వినియోగిస్తున్నారు. పశ్చిమ గోదావరికి చెందిన ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్ చాలా కాలంగా రాకెట్ ప్రొపెల్లెంట్ ఇంధనాలను ఉత్పత్తి చేస్తోంది.

విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం నుండి పొందిన సాంకేతికతతో రాకెట్ ఇంధనం తయారీ

విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం నుండి పొందిన సాంకేతికతతో రాకెట్ ఇంధనం తయారీ


తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం నుండి పొందిన సాంకేతికతను ఉపయోగించి, సంస్థ చెరకు ప్రాసెసింగ్ సమయంలో ఉప ఉత్పత్తి అయిన మొలాసిస్‌ను రెండు రకాల రాకెట్ ప్రొపెల్లెంట్‌లను తయారు చేయడానికి ఉపయోగిస్తుంది. అన్‌సిమెట్రిక్ డైమెథైల్‌హైడ్రాజైన్ (UDMH), మోనో మిథైల్‌హైడ్రాజైన్ (MMH)లను తయారుచెయ్యటానికి ఉపయోగపడుతుంది. ఆంధ్రా షుగర్స్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న తరువాత అన్‌సిమెట్రిక్ డైమెథైల్‌హైడ్రాజైన్ యొక్క వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. దీనిని అనుసరించి, ఇది ఒక అడుగు ముందుకు వేసి, మోనో మిథైల్‌హైడ్రాజైన్ ను కూడా తయారు చేయడం ప్రారంభించింది.

పోలార్, జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ రెండింటికీ ఇంధనం ఆంధ్రా షుగర్స్ నుండే

పోలార్, జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ రెండింటికీ ఇంధనం ఆంధ్రా షుగర్స్ నుండే

అన్‌సిమెట్రిక్ డైమెథైల్‌హైడ్రాజైన్, మోనో మిథైల్‌హైడ్రాజైన్ తయారీ రెండు ప్రక్రియలు సంస్థ అత్యంత రహస్యంగా నిర్వహిస్తుంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్ నుండి రాకెట్ ఇంధనాన్ని పొందుతుంది. ఇది నిర్దిష్ట దశలలో పోలార్ మరియు జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ రెండింటికీ ఇంధనంగా ఉపయోగించబడుతుంది. ఇస్రో స్పెసిఫికేషన్‌ల ప్రకారం ఇంధనాలు సరఫరా అవుతున్నందున, వాటిని నేరుగా ప్రయోగ వాహనాల్లో వినియోగిస్తున్నారు. కీలకమైన అంతరిక్ష పరిశోధనా రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారతదేశం చేస్తున్న ప్రయత్నాల్లో ఇస్రో ఆంధ్ర షుగర్స్ మధ్య ఏర్పడిన సహకారం గణనీయమైనది గా చెప్పొచ్చు.

Recommended Video

    ISRO ఇక ప్రైవేటు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి PSLV తయారీ రేసులో Adani, L&T || Oneindia Telugu
    స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఉపగ్రహాలకు ఇంధనం అందించిన ఆంధ్రా షుగర్స్

    స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఉపగ్రహాలకు ఇంధనం అందించిన ఆంధ్రా షుగర్స్


    ఇస్రో ఆంధ్ర షుగర్స్ సహకారం 1984వ సంవత్సరంలో ప్రారంభం కాగా 1985 మార్చిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభానికి పైలెట్ ప్రాజెక్టు స్థాపనకు ఇస్రో కు ఆంధ్రా షుగర్స్ కు మధ్య ఒప్పందం కుదిరింది. 1985 జూలై 4న ప్లాంటును జాతికి అంకితం చేశారు. తణుకు ప్లాంట్లో ఉత్పత్తి చేసే ద్రవరూప ఇంధనం భారతదేశ మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన బహుళ ప్రయోజనాన్ని కలిగించే ఉపగ్రహాలు INSAT-IIA, PSLV- D2, PSLV- D3 లలో వినియోగించారు. ప్రస్తుతం తణుకులో చక్కెర ఉత్పత్తి నిలిచిపోయినా,రాకెట్ ఇంధనం తయారీలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది తణుకు లోని ఆంధ్ర షుగర్స్.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+