ఏపీకి కరోనా షాక్: ఒక్కరోజే 37 మంది మృతి, 30వేలు దాటిన పాజిటివ్ కేసులు

అమరావతి: కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టెస్టులు పెంచుతున్న కొద్దీ.. కరోనా కేసులు కూడా పెరుగుతుండటం గమనార్హం. తాజాగా, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి.

24గంటల్లో 37 మరణాలు.

24గంటల్లో 37 మరణాలు.


ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 37 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటి వరకు ఒకరోజులో సంభవించిన మరణాలు ఇవే అత్యధికంగా కావడం గమనార్హం. తాజా మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 365కు చేరింది.

ఏపీలో 30వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో 30వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

కాగా, సోమవారం కొత్తగా 1935 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1919 రాష్ట్రానికి చెందినవి కాగా, ఇతర రాష్ట్రాలవారు 13 మంది ఉన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చినవారు ముగ్గురు ఉన్నారు. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 31,103కి చేరింది. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 28,255 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 2416 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన 432 మంది ఉన్నారు.

ఏపీలో సగం కంటే ఎక్కువగానే రికవరీ..

ఏపీలో సగం కంటే ఎక్కువగానే రికవరీ..

ప్రస్తుతం రాష్ట్రంలో 14,274 యాక్టివ్ యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 11,958 మంది వివిధ ఆస్పత్రుల్లోనూ, 2316 మంది కరోనా సెంటర్లలోనూ వైద్యం పొందుతున్నారు. వీరిలో రాష్ట్రానికి చెందినవారు 13,615 మంది, 550 మంది ఇతర రాష్ట్రాలవారు, 109 మంది ఇతర దేశాలవారున్నారు. సోమవారం డిశ్చార్జ్ అయిన 1030 మందితో కలిసి మొత్తంగా 16,464 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Recommended Video

    Russia Successfully Complete Human Trials Of Coronavirus Vaccine || Oneindia Telugu
    ఏపీ: జిల్లాల వారీగా కరోనా మరణాలు

    ఏపీ: జిల్లాల వారీగా కరోనా మరణాలు

    గత 24 గంటల్లో ఏకంగా 37 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 365కు చేరింది. తాజా మరణాల్లో అనంతపురం జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+