ఆంధ్రాకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు..! ఏకంగా సింగపూర్ లో ..!

ఆంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ స్ధాయిలో మరో అరుదైన గుర్తింపు లభించింది. అదీ హస్తకళల (handicrafts) విషయంలో. హస్తకళల కేంద్రమైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలు వస్తువుల్ని ఏకంగా సింగపూర్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గిఫ్ట్ ల రూపంలో ఇవ్వాలని అక్కడి హైకమిషనర్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నిర్ణయంతో మన రాష్ట్రంలో హస్తకళలపై ఆధారపడిన వారికి ఎంతో మేలు జరగనుంది.

సింగపూర్ లో జరిగే భారత్ రిప్లబిక్ డే వేడుకల్లో ఏపీ హస్త కళల గిఫ్ట్ బాక్స్ అందజేయాలని భారత్ హై కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 400 ప్రత్యేక గిఫ్ట్ బాక్స్ లకు లేపాక్షికి ఆర్డర్ సింగపూర్ భారత్ హై కమిషనర్ ఇచ్చార. ఈ గిఫ్ట్ బాక్స్ లో సీతాదేవి లెదర్ పప్పెట్రీ, ఏనుగు ఆకారపు బ్యాగేజ్ ట్యాగ్, హ్యాండ్ పెయింటెడ్ ఏనుగు కోస్టర్ కళారూపాలు ఉన్నాయి. ఏపీ హస్త కళలకు ప్రపంచ స్థాయి గుర్తింపుపై రాష్ట్ర మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు.

Andhra s Handicrafts Gain Global Spotlight with Donation at Singapore s Indian R-Day Celebrations

గతేడాది రిప్లబిక్ లో ఏపీ హస్త కళల శకటానికి గుర్తింపుతో మరింత ప్రాచుర్యం లభించినట్లయింది. ఏపీలో హస్త కళలకు, కళాకారులకు కూటమి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. కళారూపాల తయారీలో ఆధునిక హంగులకు కళాకారులకు శిక్షణ కల్పించడం తో పాటు లేపాక్షి షో రూమ్ ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విశాఖపట్నం, అనంతపురం, కడప సహా ప్రధాన కేంద్రాల్లోని 15 షోరూమ్‌లు ఆధునీకరిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. త్వరలో ఇతర దేశాల్లోనూ లేపాక్షి షో రూమ్ ల ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+