సీఎం సొంత జిల్లాలో అన్న క్యాంటీన్లు ఎవరు ప్రారంభించారో తెలుసా, లీడర్ లక్షణాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చేతుల మీదుగానే అన్న క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో, మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి సొంత నియోజకవర్గం పలమనేరులో, వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో స్థానిక టీడీపీ నాయకులు అన్న క్యాంటీన్లు ప్రారంభించారు.
ముఖ్యంగా కుప్పం పట్టణంలో అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్బంగా టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లోని ఆ రెండు రాష్ట్రాల ప్రజలు కుప్పంకు ప్రతిరోజు వేలాదిమంది వచ్చి వెళ్తుంటారు. అలాంటి కుప్పంలో ఇప్పుడు అన్న క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని పేద ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు చెందిన ప్రజలు కుప్పం నుంచే రైలులో సంచరిస్తుంటారు.

కుప్పంలో అన్న క్యాంటీన్లు ప్రారంభించి ఐదు రూపాయలకే టిఫిన్, ఐదు రూపాయలకే మద్యాహ్నం, రాత్రి భోజనం పెట్టడం చాలా సంతోషంగా ఉందని పేద ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో కూడా కుప్పంలో అన్న క్యాంటీన్లు ఉండేవి. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు మొత్తం మూతపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభం అయ్యాయి.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో కూడా అన్న క్యాంటీన్ ను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చల్లా రామచంద్రా రెడ్డి, వెంకటరమణ రాజు ప్రారంభించారు. పుంగనూరు పరిసర ప్రాంతాల్లో వందలాది గ్రామాలు ఉన్నాయి. కర్ణాటక నుంచి కూడా ప్రతిరోజు చాలామంది రైతులు, కూలీలు వచ్చి వెళుతుంటారు. అలాగే బెంగళూరు- చెన్నై హైవే లో ఉన్న పలమనేరు పట్టణంలో కూడా అన్న క్యాంటిన్ ప్రారంభమైంది.

పలమనేరులో అతి పెద్ద టమోటా మార్కెట్ ఉంది. ఇదే టమోటా మార్రెట్ కు ప్రతిరోజు వేలాది మంది రైతులు, కార్మికులు, కూలీలు వచ్చి వెళుతుంటారు. ఇక తమిళనాడు సరిహద్దులోని చిత్తూరు నియోజక వర్గంలో కూడా అన్న క్యాంటిన్ ప్రారంభం అయ్యింది. ఇలా సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోని అన్ని నియోజక వర్గాల్లో అన్న కాంటీన్లు ప్రారంభించారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో అన్న క్యాంటీన్ లను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చేతుల మీదుగానే ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఆ జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు అంటున్నారు.
-
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
చంద్రబాబుకు జాతీయ పార్టీ నేత సవాల్: మణిపూర్ లా తయారవుతాయి -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications