Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేడే 'అన్నదాత సుఖీభవ' నిధుల జమ - ఈ ప్రాంతాల్లోని రైతులకు ఆలస్యం, ఇక అప్పుడే..!!

ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నిధులు ఈ రోజు విడుదల చేయనుంది. సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను ఈ రోజు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. కాగా, చివరి నిమిషంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని జిల్లాల్లోని రైతులకు ఈ రోజు అన్నదాత సుఖీభవ నిధుల జమకు బ్రేకు పడింది. పీఎం కిసాన్ నిధులు మాత్రం జమ కానున్నాయి. ఈ రోజు జమ కాని రైతుల ఖాతాల్లో తిరిగి ఎప్పుడు నగదు వేసేదీ అధికారులు స్పష్టత ఇస్తున్నారు.

రైతుల ఖాతాల్లో నిధులు
అన్నదాతా సుఖీభవ పథకాన్ని ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 46 లక్షల 85 వేల 838 మంది రైతులు లబ్ది పొందుతారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు ఐదు వేలు చొప్పున, మొత్తం 2 వేల 342 కోట్ల 92 లక్షల రూపాయల నిధుల్ని వారి ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది. కాగా, రైతు భరోసా కేంద్రాల్లో ముందుగానే అర్హుల జాబితాలను అధికారులు అందు బాటులో ఉంచారు. రైతులకు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించారు. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సందేహాలను పరిష్కరించారు. కాగా, తుది జాబితాకు అనుగుణంగా ఈ రోజు నగదు అర్హత సాధించిన రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది.

annadata-sukhibava-funds-credit-delay-in-election-code-areas-as-ec-orders

ఈ ప్రాంతాల్లో బ్రేక్
అయితే.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న చోట్ల అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రభుత్వాన్ని ఆదేశించారు. పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్లతోపాటు రాష్ట్రంలో మరో మూడు మండలాలు, రెండు గ్రామాల పరిధిలోని రైతుల ఖాతాల్లో జమ చేయవద్దని స్పష్టం చేశారు. వీటి పరిధిలోని గ్రామపంచాయతీ, మండల పరిషత్తు, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని పేర్కొంటూ వ్యవసాయశాఖ ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కాగా, ఇప్పటికే కొనసాగుతున్న కార్యక్రమంగా పీఎం కిసాన్‌ 20వ విడత నిధులను విడుదల చేయవచ్చని స్పష్టత ఇచ్చారు. ఇదే సమయంలో ఈ ప్రాంతాల్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధుల హాజరు పైన కొన్ని సూచనలు చేసారు.

కోడ్ - నిబంధనలు
ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొనకూడదని, అధికార పార్టీ విజయాలను ప్రచారం చేసేలా రాజకీయ ప్రసంగాలు చేయకూడదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిశాక మాత్రమే ఆయా ప్రాంతాల్లో 'అన్నదాతా సుఖీభవ' నిధుల్ని పంపిణీ చేయాలని సూచించారు. ప్రకాశం జిల్లా కొండపి, తూర్పుగోదావరి జిల్లా కడియపులంక గ్రామ పంచాయతీలు, చిత్తూరు జిల్లా రామకుప్పం, నెల్లూరు జిల్లా విడవలూరు, పల్నాడు జిల్లా కారంపూడి మండలాలు, పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో, ఈ ప్రాంతాల్లోని రైతుల ఖాతాల్లో ఈ పథకం నిధులు ఎన్నికల కోడ్ పూర్తయిన తరువాతనే జమ కానున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+