అన్నదాత సుఖీభవ నిధుల విడుదల- చెక్ చేసుకోండి..!
ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం-పీఎం కిసాన్ పథకం (Annadata Sukhibhava-PM Kisan) కింద రైతులకు ప్రతీ ఇస్తున్న నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. 2026-27 సంవత్సరంలో రెండో విడత కింద ఈ నిధుల్ని జమ చేశారు. రాష్ట్రవాటాగా రూ.2234 కోట్లు జమ చేయగా.. కేంద్రం కూడా తమ వాటా నిధుల్ని విడుదల చేసింది. దీంతో రైతుల ఖాతాల్లో మొత్తం రూ.6 వేల నిధులు జమ అయ్యాయి.
రాష్ట్రంలో అన్నదాత-సుఖీభవ- పీఎం కిసాన్ కింద రెండో విడతగా ఇవాళ నిధులు విడుదల చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జమ చేసిన నిధులు రైతుల ఖాతాల్లోకి 24 గంటల్లోకా క్రెడిట్ కానున్నాయి. ఈ మేరకు 24 గంటల్లోనే 99 శాతం రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే పలు సాంకేతిక కారణాలతో 17,828 మంది రైతుల ఖాతాల్లో మాత్రం ఈ పథకం నగదు జమ కావడం లేదు. దీంతో వేగంగా సాంకేతిక సమస్యల్ని పరిష్కరించి మిగిలిన రైతులకూ అన్నదాత పథకం నిధులు అందేలా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

రాష్ట్రంలో సాధారణంగా అయితే అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధుల విడుదలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించేది. సీఎం చంద్రబాబు సభ ఏర్పాటు చేసి ఈ పథకానికి సంబంధించిన వివరాలు వెల్లడించేవారు. కేంద్రం పీఎం కిసాన్ పథకం నిధులు జమ చేయగానే, రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా జమ చేసేవారు. కానీ ఈసారి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వం ఓటర్లను ప్రభావితం చేసే ఏ కార్యక్రమాలూ నిర్వహించకూడదు. అందుకే ఈసారి ఎలాంటి హడావిడి లేకుండా నిధుల్ని రైతుల ఖాతాల్లో అధికారులు బ్యాంకుల ద్వారా నేరుగా జమ చేసేశారు. కాబట్టి రైతులు తమ బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుంటే నిధులు జమ అయి ఉంటాయని అధికారులు చెప్తున్నారు.














Click it and Unblock the Notifications
