AP Volunteers: నెల్లూరులో టీడీపీలో చేరిన మరో 100 మంది వాలంటీర్లు...!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇన్నాళ్లూ వైసీపీ తమను నియమించిందన్న కారణంతో ప్రభుత్వానికి మద్దతిస్తూ వచ్చిన వాలంటీర్లు.. ఎన్నికల వేళ రూటు మార్చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 40 వేల మందికి పైగా వాలంటీర్లు వైసీపీ సూచనల మేరకు రాజీనామా చేసి ఆ పార్టీకి ప్రచారం సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో మాత్రం వాలంటీర్లు పలు చోట్ల వైసీపీకి షాకులిస్తున్నారు..
ఇప్పటికే నెల్లూరు జిల్లా కోవూరులో 40 మంది వాలంటీర్లు తాజాగా తమ ఉద్యోగాలు వదిలిపెట్టి టీడీపీలో చేరిపోయారు. ఇవాళ నెల్లూరులో 100 మంది వాలంటీర్లు రాజీనామాలు చేసి టీడీపీలో చేరారు. నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్ధి నారాయణ సమక్షంలో వీరంతా టీడీపీ తీర్దం పుచ్చుకున్నారు. వీరందరినీ నారాయణ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. దీంతో ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమవుతోంది.

వాలంటీర్లకు టీడీపీ వ్యతిరేకమన్న వైసీపీ ప్రచారం మధ్య చంద్రబాబు వారికి తాము అధికారంలోకి వస్తే నెలకు 10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే తాము అధికారంలోకి వచ్చినా వాలంటీర్లను తొలగించబోమని హామీ ఇచ్చారు. దీంతో నెల్లూరు జిల్లాలో మారిన పరిస్ధితుల్లో వాలంటీర్లు రూటు మార్చినట్లు అర్ధమవుతోంది. టీడీపీ నేతల నుంచి లభిస్తున్న హామీలతో వారంతా పచ్చ కండువాలు కప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications