మాచర్లలో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం తర్వాత వైరల్ అవుతున్న మరో ఈవీఎం ధ్వంసం వీడియో
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మే 13న జరిగిన ఎన్నికల పోలింగ్ నాడు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో ఎన్నికల కమిషన్ దీనిపై సీరియస్ గా స్పందించింది. తక్షణం ఆయనను అరెస్టు చేయాలని ఆదేశించడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని అరెస్ట్ చేశారు.
మరో ఈవీఎం ధ్వంసం వీడియో వైరల్
ఇక వైసీపీ నేతల దాడులు, ఈవీఎంల ధ్వంసం ఘటనలను తెలుగు తమ్ముళ్లు టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా విరుచుకు పడుతుంటే, వైసిపి కూడా ఒక వీడియోతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత ప్రస్తుతం సోషల్ మీడియాలో మరొక వీడియో వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో జనసేన అభ్యర్థి ఈవీఎం ధ్వంసం వీడియో వైరల్
ఈ వీడియోతో గుంతకల్లు టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి మధుసూదన్ గుప్తా EVM లు ధ్వంసం చేశారని, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి పై కేసు నమోదుతో తాజాగా ఈ వీడియో వెలుగులోకి వచ్చిందని, దీనిపై ఎన్నికల సంఘం ఏమి చర్యలు తీసుకుంటుందో మరి అంటూ సోషల్ మీడియా వేదికగా ఇది వైరల్ అవుతుంది.
2019 గుత్తి పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటన
అయితే ఈ వీడియో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించిన వీడియో కాదు. 2019లో జరిగిన ఎన్నికల సమయంలో జరిగిన ఘటన. 2019 ఏప్రిల్ 11వ తేదీన అనంతపురం జిల్లా గుత్తి బాలికోన్నత పాఠశాలలోని 183వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా పోలింగ్ సమయంలో ఈవీఎం మిషన్లో తన ఫోటో లేదని, పేరు సరిగ్గా రాయలేదని ఆగ్రహానికి గురయ్యారు.
గుంతకల్లు టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి మధుసూదన్ గుప్తా EVM లు ధ్వంసం చేసాడు.
— Hariswar Reddy (@hariswar_Reddy_) May 22, 2024
పల్నాడు టీడీపీ నేతలకు ఇవి కనిపించలేదా.
పాపం భ్రమలో బ్రతుకుతున్నట్లు ఉంది పల్నాడు టీడీపీ అభ్యర్థి.
టీడీపీ అరాచకాలు కప్పి పుచ్చుకోవడం పుచ్చుపోయిన తెలివి తేటలతో అధికార పార్టీ పైన నెగటివ్ చేయాలి… pic.twitter.com/VsGfuUsqoW
ఈవీఎం ధ్వంసం చేసిన మధుసూదన్ గుప్తా.. పాత వీడియో మళ్ళీ వైరల్
చాలా అన్యాయమైన ఎలక్షన్ జరుగుతుందంటూ ఆ ఈవీఎం మిషన్ ను మీడియా సాక్షిగా ధ్వంసం చేశారు. ఇక కోపంతో ఆయన చేసిన నిర్వాకం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, పోలింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలింగ్ కు ఉపయోగించే ఈవీఎంను ధ్వంసం చేసినందుకు ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఇక నాటి వీడియోని ప్రస్తుతం మళ్ళీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ల ధ్వంసం వీడియో బయటకు వచ్చిన నేపధ్యంలో మళ్ళీ వైరల్ చేస్తున్నారు.
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
IMDB అల్లు అర్జున్ టాప్-10 మూవీస్.. ‘పుష్ప2’కు దక్కని చోటు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..!












Click it and Unblock the Notifications