Chandrababu: చంద్రబాబుకు ఈసీ మరో గుడ్ న్యూస్..!
ఏపీలో ఎన్నికల వేళ చంద్రబాబుకు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ సరళి తమకు అనుకూలంగా ఉందని భావిస్తున్న చంద్రబాబు..ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై వరుసగా ఈసీ, గవర్నర్ ను ఆశ్రయిస్తున్నారు. ఇందులో ప్రతీ చోటా చంద్రబాబుకు అనుకూలంగానే నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఆయన కోరుకున్న విధంగా వారి నిర్ణయాలు ఉంటుండటంతో టీడీపీ క్యాడర్ లోనూ జోష్ నెలకొంటోంది.
ఇప్పటికే రాష్ట్రంలో పోలింగ్ కు ముందు సంక్షేమ పథకాల డబ్బుల విడుదలకు సిద్దమైన ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని ఈసీని చంద్రబాబు కోరడం, ఆ మేరకు పోలింగ్ తర్వాతే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల మొత్తాలు విడుదల చేయాలని ఆదేశించడం తెలిసిందే.ఆ తర్వాత పోలింగ్ ముగియడంతో సంక్షేమ పథకాల డబ్బులు విడుదల చేయకుండా పాత బిల్లులు క్లియర్ చేస్తున్నారంటూ టీడీపీ గవర్నర్ ను ఆశ్రయించడంతో దానికీ అడ్డుకట్ట పడింది.

ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలకు ముందే పాలనలో కీలకమైన ఈ-ఆఫీస్ సాప్ట్ వేర్ అప్ గ్రేడ్ చేసేందుకు అదికారులు సిద్ధమయ్యారు. దీనిపైనా చంద్రబాబు ఈసీని ఆశ్రయించారు. నిన్న ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. ఫలితాల వేళ ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ చేయడంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ ఈ ప్రక్రియను వాయిదా వేయించాలని కోరారు. దీనికీ ఈసీ అంగీకరించింది.
చంద్రబాబు లేఖ అందుకున్న సీఈవో ముకేష్ కుమార్ మీనా ఇవాళ ఎన్ఐసీ ప్రతినిధుల్ని పిలిపించి ఈ-ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ చేసే ప్రక్రియను వాయిదా వేసుకోవాలని ఆదేశించారు. విపక్షాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, కాబట్టి దీన్ని వాయిదా వేయాలని కోరారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వెర్షన్ తోనే ఈ-ఆఫీస్ ను కొనసాగించాలని సూచించారు. దీంతో ఈ ఆఫీస్ అప్ గ్రేడ్ చేసే ప్రక్రియను వాయిదా వేయాలని ఎన్ఐసీ నిర్ణయించింది.
-
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications