వైసీపీలో మరో గోరంట్ల మాధవ్ ? అదీ కేబినెట్ మంత్రి-త్వరలో వివరాలిస్తామన్న జైభీమ్ పార్టీ నేత
ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నవీడియో వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. న్యూడ్ వీడియోతో దొరికిన మాధవ్ పై ఇప్పటివరకూ వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో విపక్షాలు కూడా వైసీపీపై విమర్శలతో ఒత్తిడి పెంచుతున్నాయి. అదే సమయంలో జైభీమ్ పార్టీ నేత జడ శ్రావణ్ కుమార్ ఇవాళ మరో బాంబుపేల్చారు.
వైసీపీలో గోరంట్ల మాధవ్ తరహాలోనే ఓ మంత్రి కూడా ఉన్నారంటూ జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మాధవ్ లాగానే ఇంకో ఘనత వహించిన మంత్రి బాగోతం కూడా త్వరలో బయట పెడతానంటూ ఆయన విజయవాడలో వ్యాఖ్యానించారు. బాధితులు ఇప్పటికే తనతో మాట్లాడారన్నారు.
పూర్తి ఆధారాలతో వారిని మీడియా ముందుకు త్వరలో తీసుకువస్తామన్నారు. వైసీపీ ఏది చేసినా జాతీయ రికార్డ్ గా నే మిగిలిపోతుందన్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ గతంలో గెలిచిన 151 సీట్లలో రానున్న ఎన్నికల్లో 70 శాతం కోల్పోతుందని జడ శ్రావణ్ కుమార్ జోస్యం చెప్పారు. ఓట్లు వేసిన ప్రజలను వేటాడి, వెంటాడి చంపడం వైసీపీ తత్వమన్నారు. వారిపై అన్ని రకాలుగా దాడులు చేయడం చూస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వైసీపీ మహిళా మంత్రులు రోజా, విడదల రజనీ అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యల్ని ఆయన వీడియో ప్రదర్శించారు. ఉండవల్లి శ్రీదేవి కూడా గతంలో జగన్ ను ఎంత బాగా పొగిడినా ఆమెకి మంత్రి ఇవ్వలేదన్నారు. మరో మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి టిక్ టాక్ లు చేస్తాని, దళితులు గిరిజనుల కోసం ఆమె పోరాటం చేయరని శ్రావణ్ విమర్శించారు.
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఓ మిత్రుని వద్ద తమను చూసి ఓట్ లు వెయ్యలేదు , జగన్ ను చూసే వేశారు అన్నారని జైభీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ తెలిపారు. ప్రస్తుతం ఎంపీ మాధవ్ వీడియో ట్విట్టర్ లో రికార్డ్ లు సృష్టిస్తోందన్నారు. చేసిన పనిపై సిగ్గుపడకుండా ఒక మీడియాను తిడతారా అంటూ శ్రావణ్ ప్రశ్నించారు. సినీ నటుడు పృధ్వీ కి ఎస్వీబీసీ చైర్మన్ గా ఇచ్చారని, ఆ పిచ్చి బత్తాయిది ఒక ఆడియో బయటకు వచ్చిందంటూ విమర్శించారు.
అంబటి రాంబాబు విజయాన్ని బాధితురాలు బయటపెట్టిందని, ఎందుకు మహిళ కమిషన్ వీరిపై స్పందించదని ఆయన ప్రశ్నించారు. ఆడవాళ్ళతో ఎవ్వరైన అసభ్యంగా మాట్లాడితే వారికి ప్రమోషన్ ఇస్తారా అని నిలదీశారు.
పృథ్వి ఇప్పుడు జనసేన లో జాయిన్ అవుతారట.. అలాంటి వాళ్లకు ఆ పార్టీ నే కరెక్ట్ అని జై భీం భరత్ పార్టీ భావిస్తోందన్నారు.
పృధ్వి, అంబటి, అవంతీలపై చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు గోరంట్ల మాధవ్ కు జగన్ మోహన్ రెడ్డి అలుసైపోయారని శ్రావణ్ తెలిపారు. ఇకపై బుల్లెట్ కన్న వేగంగా జగనన్న వస్తాడు అని ఇంకోసారి అనడం మంత్రులు రోజా, రజనిలు మానుకోవాలన్నారు. ఇలాంటి సంఘటన జరిగాక కనీసం అంతర్గతంగా అయిన ఎంక్వైరీ వెయ్యలేదని ఆయన వైసీపీని విమర్శించారు. మాధవ్ పై ఎందుకు విజయసాయి ట్వీట్ చేయలేదని కూడా ఆయన ప్రశ్నించారు. ఎంపీ రఘు రామకృష్ణంరాజును అయితే దేశ ద్రోహం కేస్ పెట్ట లోపల వేసారని, మాధవ్ ను ఎందుకు వదిలేశారు, తెలుకుట్టిన దొంగల్లా వుండిపోయారని శ్రావణ్ ప్రశ్నించారు. మాధవ్ విషయంలో విజయసాయి, సజ్జల స్పందించాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రతిసారీ ప్రశ్నిస్తోంది జై భీం భరత్ పార్టీ మాత్రమేనన్నారు.












Click it and Unblock the Notifications